Central-state : రిజర్వేషన్ అంశం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలది

– కాంగ్రెస్‌, బీజేపీలది కాదు
– ఉప‌ ముఖ్య‌మంత్రి  మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 6:  బీసీల రిజర్వేషన్ (BC reservations) అంశం కాంగ్రెస్, బిజెపిలకు సంబంధించింది కాదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల‌కు సంబంధించినది. తెలంగాణ (Telangana) దేశానికి దిక్సూచిగా మారింద‌ని ఉప‌ముఖ్య‌ మం త్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. బుధ‌వా రం దిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల రిజర్వేషన్ పై ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగించారు.  స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ మించకుండా బిఆర్ఎస్ నేతలు పెట్టిన పరిమితిని తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆర్డినెన్స్ తెచ్చింది. జంతర్ మంతర్ ధర్నా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినద‌న్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు త‌మ‌ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని క్యాబినెట్లో ఆమోదించి బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ కు పంపామ‌ని గుర్తుచేశారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్న‌ది, సర్వేలో ఏ చిన్న పొరపాటు జరగకుండా సైంటిఫిక్ గా సర్వే చేయాలని నా ఆధ్వర్యంలో ఉన్న ప్రణాళికా శాఖకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ అప్పగించింది. 1.05 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుని ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేని రీతిలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *