ties rakhi to tree : చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి

భోపాల్‌, ఆగస్టు 9: దేశవ్యాప్తంగా శనివారం రాఖీ వేడుకలు ఘనంగా జరగగా కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ చెట్టుకు రాఖీ కట్టారు. వృక్షాలు ఆక్సిజన్‌ అందిస్తాయని, పక్షులు, ఇతర జీవాలు కూడా చెట్లను జీవాధారంగా చేసుకుని జీవిస్తాయని ఆయన చెప్పారు. చెట్టుకు రెండు రాఖీలు కట్టిన ఆయన హారతి కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొందరు మహిళలు, యువతులు మంత్రికి రాఖీలు కట్టారు. ఆ ఆడపడుచులను ఆయన ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *