దక్షిణాదిపై కేంద్రం వివక్ష

– పోరాటానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధం కావాలి
– డి-లిమిటేషన్, 50 శాతం ఎంపీ స్థానాల పెంపుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు డి-లిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50 శాతం ఎంపీ సీట్ల పెంపు ఏ లెక్కల ప్రకారం జరుగుతున్నదని ప్రశ్నిస్తూ 50 శాతం సీట్ల పెంపు అనేది ఫైనల్ బుల్లెట్.. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.. 50 శాతం సీట్ల పెంపు వల్ల కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో తమ అవసరం లేకుండా పోతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటులేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. అందువల్ల అన్ని పక్షాలతో చర్చలు జరిపి సీట్ల పెంపుపై ముందుకు వెళ్లాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకమని, ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్య అంతరాన్ని ఎన్డీయే ప్రభుత్వం పెంచుతోందని, దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *