యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 9: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గోదాదేవికి ఈనెల 10 నుండి 14వ తేదీ వరకు ఐదు రోజులపాటు నెరటోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. 15న ఉదయం 11.45 గంటలకు అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో ఐదు రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు సేవలను ఆలయ మాడ వీధులలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణాలతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అమ్మవార్ల ఆశీస్సులు పొంది గోదాదేవి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



