– అమ్రాబాద్ వద్ద స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీలు
నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, డిసెంబరు 19:భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. శ్రీశైలం వెళ్లే క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్వాగతం పలికారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు దిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుండి నేరుగా రోడ్డు మార్గాన శ్రీశైలం వెళ్తూ మార్గమధ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్ గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. జ్ఞానేష్ కుమార్ కు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపట్ రావు పాటిల్, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాసేపు విరామం తర్వాత నేరుగా శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, డీఎస్పీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.