నూతన ప్రజాస్వామ్య విలువల కల సాకారం చేయండి
మావోయిస్ట్ పార్టీ నాయకత్వానికి బహిరంగ లేఖ
గతంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో తీసుకున్న సాయుధ పోరాటం విరామం ప్రజా సంఘాల ఏర్పాటుకు దారి తీసింది. లీగల్ గా పని చేసే అవకాశం కలిగింది. లక్షలాది పేదలకు అండగా నిలవడానికి అవకాశం ఏర్పడిరది. లక్షలాది యువతి యువకులను కదిలించడానికి పేదల పక్షం వహించాలని రాజకీయ శిక్షణలు ఇచ్చారు. యువతి యువకులు ఎందరో పేదలకు అండగా నిలిచారు.
మావోయిస్ట్ పార్టీ మరో సారి మేధోమథనం చేయాలి. ప్రభుత్వాలు సాయిధ బలగాలు వత్తిడి పెంచాయని కాదు కానీ పీడిత ప్రజల పక్షాన నిలబడడానికి ఈ ఆలోచనగా పరిగణించాలి. ఇది అశేష ప్రజల చిరకాల డిమాండ్ కూడా . వారి పక్షం వహించే వారే లేరు . ప్రభుత్వాలకు ,రాజకీయ పక్షాలకు ప్రజలతో మీరు లేని ఆనందం అంతా ఇంతా కాదు. పైకి జన జీవన స్రవంతి పాట పాడినా మీరు ప్రజల చెంత ఉండ వద్దు అనేదే వారి కోరిక. మీరు భుజానికెత్తుకున్న తుపాకి కి కాదు వారి భయం మీకు పీడిత ప్రజల పట్ల ఉన్న అచంచల ప్రేమ అంటే భయం అలాగే పీడిత ప్రజలకు మీ పై ఉన్న ప్రేమంటే వాళ్ళకు భయం . మీ నిజాయితీ నియ్యత్ అంటే హడల్ వాళ్ళకు. మీరు సాయుధం గా ఉండడం ఒక్కటే వాళ్ళకు సుఖం సౌకర్యం. ప్రజల నుండి దూరం పెట్టడానికి ఈ ఒక్క సాకు చాలు వాళ్ళకు.
అందరి విధానాలు ప్రజా వ్యతిరేకమైనవే . వారిని నైతికంగా ప్రశ్నించే గొంతులు లేక పేదలు నిస్సహాయ స్థితి లోకి వెళ్లి పోయారు . అక్కడ అక్కడ ప్రజా ఉద్యమాలు ఉన్నాయి కానీ. వారితో నిజాయితీగా కొన సాగే రాజకీయ పక్షం లేనందు వలన బలహీన పడిపోతున్నారు. వారికున్న ఒకే సాధనం వోటు. దానితో ఒకరిని మార్చి ఇంకొకరిని పాలన చేయమని ఆదేశిస్తున్నారు . అన్ని ప్రయోగాలు విఫలం అవుతున్నాయి.
ప్రభుత్వాలకు,రాజకీయ పక్షాలకు ప్రజలతో మీరు లేని ఆనందం అంతా ఇంతా కాదు. పైకి జన జీవన స్రవంతి పాట పాడినా మీరు ప్రజల చెంత ఉండ వద్దు అనేదే వారి కోరిక. మీరు భు జానికెత్తుకున్న తుపాకి కి కాదు వారి భయం మీకు పీడిత ప్రజల పట్ల ఉన్న అచంచల ప్రేమ అంటే భయం.. అలాగే పీడిత ప్రజలకు మీ పై ఉన్న ప్రేమంటే వాళ్ళకు భయం . మీ నిజాయితీ నియ్యత్ అంటే హడల్ వాళ్ళకు. మీరు సాయుధం గా ఉండడం ఒక్కటే వాళ్ళకు సుఖం సౌకర్యం. ప్రజల నుండి దూరం పెట్టడానికి ఈ ఒక్క సాకు చాలు వాళ్ళకు.
మీరు సాయుధ పోరును విరమించి ప్రజా సమస్యలను తీర్చే ఉద్యమాలను నిర్మించడానికి తగు అవకాశాలు ఉన్నాయి. మారిన కాలమాన పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఒక వైపు సామాజిక మాధ్యమాల ప్రభావం , డిజిటల్ పాలన , డైరెక్ట్ ట్రాన్ఫర్ బెనిఫిట్ (ణదీు) మరోవైపు జూమ్ కాల్స్ ఆన్లైన్ సమావేశాలు సదస్సులు పిటిషన్లు నిరసనలు. మారిన పరిస్థితికి ప్రజలతో కలిసి పనిచేసే విధానాన్ని అలవరచుకొని ప్రజలను సమీక్షించాల్సిన అవసరం ఉందని మీకు తెలియనిది కాదు . అంతే కాదు మీరు వదిలి వెళ్ళిన సమాజం అప్పటి లాగా లేదు. కుల అస్తిత్వ ఉద్యమాలు ఊపు అందుకున్నాయి. పీడిత ప్రజల మధ్య ఐక్యత కన్నా ఎక్కువ విభజననే చూస్తున్నాము. మత రాజకీయాలు మీకు తెలియనివి కాదు. కనీస రాజ్యాంగ ప్రాథమిక హక్కుల కు అతి దూరంగా ఉన్నారు. ఉత్తర భారతం అయితే ఇంకా బహుదూరం లో ఉన్నారు.
ప్రజల కోసం సాయుధ పోరాటాన్ని విరమించి విశాల జన సామాన్యాన్ని కదిలించి వారి సమస్యల పక్షం వహించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. మీ వల్లనే అవుతుందని కూడా నమ్ముతున్నారు.
మీరు వదిలి వెళ్లిన ఎర్ర జెండా ప్రదేశాలలో కాషాయ జెండాలు గులాబీ జెండాలు మూడురంగుల జెండాలు ఎగురుతున్నాయి. ప్రజలు బలహీన పడ్డారు. నిస్సహాయ స్థితిలో ఎవరితో నైనా వెళ్లడానికి కాంప్రమైజ్ అయ్యారు. వాళ్ళు ప్రతి రోజు జీవన్మరణ పోరాటాల్లో ఉన్నారు వారికి అండగా ఎవరు లేరు. ఉన్నా రాజకీయ లబ్ది కోసమే కానీ ప్రజల దుఖాలను తీర్చడానికి కాదు. పైగా ఒకే రకంగా ఉన్న ఆయా పార్టీల విధానాల వలన మరింత బలహీన పరుస్తున్నారు. ఒక తరం ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది మీ మీద. ఆ తరం వెళ్ళిపోతే ప్రజల కోసం రాజీ లేని పోరు చేసే మీ లాంటి పార్టీ ఒకటి ఉందని మరిచి పోయే ప్రమాదం కూడా ఉంది.
మారిన పరిస్థితుల్లో మరొక పెద్ద మార్పు దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు తరిలారు. కోవిడ కాలం లో మనం చూసిందే. అనేక ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు స్థానికులు కాదు.రైతులు లేరు. కౌలుదారులే ఉన్నారు. అసలు యజమానులు కనిపించని వస్తు ఉత్పత్తి చేయకుండానే పెద్ద పెద్ద పెట్టుబడి దారి దిగ్గజాలు వెలిశాయి.వోల ఉబర్ స్వీగ్గి జోమటో లాంటి కంపనీలలో పాత పద్దతులలో కార్మిక వర్గం సంఘటితం కాలేని స్థితికి ప్రభుత్వ విధానాలు ఉండే విధంగా ఈ దిగ్గజాలు ప్రభావితం చేశాయి. ఈ రెండు దశాబ్ద కాలం లో పట్టణ పేదల సమస్యలు వర్ణనాతీతం. పేదల సమస్యలు చర్చకు రావడం లేదు.ప్రజా వైద్యం,విద్యా ఉపాధి ఆటకెక్కాయి మీరు లేరు కాబట్టి రాకుండా చేశారు. కనీస వేతనాలు, భూమి సమస్య , దళితుల పై దాడులు , అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు దోపిడీ దౌర్జన్యాలు అనే పదాలు వినపడమే లేదు. మద్యం మీద మీరు చేసిన పోరాటాలకు మహిళలు ఆనంద పడేది. మీతో నడిచి పోరు చేసేది. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం లో మద్యం మీదనే ఎక్కువ. మహిళల పై పిల్లల పై హింస విపరీతంగా పెరిగింది. యవ్వనం లోనే మద్య వయస్సులోనే మద్యం వ్యసనానికి బలి ఆయి చనిపోతున్న వారి సంఖ్య లెక్కనే లేదు. భర్తలు కోల్పోయిన మహిళల కు పెన్షన్లను స్థానిక నాయకులు మేళా లో ఫోటోలకు నవ్వుతూ ఫోజులిస్తూ పంచుతున్నారు. ఆ చావులకు వాళ్ల ప్రభుత్వ విధానమే అని మీలాగా ధైర్యంగా చెప్పే నాదులే లేరు.
ముఖ్యంగా తెలంగాణ లో ప్రతి గ్రామం లో మీరంటే ఇష్టపడే ఒక తరం ఉంది. మీ రాజకీయాల స్పూర్తి పొందిన వారు ఉన్నారు. మీరు లేని కారణంగా ఎటూ తోచని స్థితిలో పడి ఉన్నారు. కొందరు రాజీపడి ఆత్మను చంపుకుని వివిధ పార్టీలలో చేరి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అవకాశవాద రాజకీయాలను భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు స్వచ్చంద సంస్థలలో తోచిన పనులు చేస్తున్నారు కొందరు వ్యాసాలు రాస్తూ తమ ఆవేదనలను వెళబుచ్చుతున్నారు. ప్రభుత్వాలతో ప్రజల పక్షం వహించి వారికి చేతనైనంత లో రాజీలేని పోరు చేస్తూనే ఉన్నారు.
ఆలోచన చేయండి. సాయుధ పోరు విరమణ ప్రకటన చేసి పరేడ్ గ్రౌండ్స్ లో ఒక బహిరంగసభ ఏర్పాటు చేసి ప్రజలకు ఒక పిలుపు నివ్వండి .వ్యక్తులుగా వస్తే ప్రయోజనం లేదు. అలాటి వారు కొన్ని ప్రయోగాలు చేశారు కూడా. ప్రజలకు అన్నలు అంటే అన్నల పార్టీ అంటే వారికి ఒక బ్రాండ్ ఎంబాసిడర్స్. ఒక్కటే ఆశ ఒక్కటే డిమాండ్ సాయుధ పోరుకు స్వస్తి చెప్పాలని. రాజ్యాంగ బద్దంగా ప్రజల నాయకులుగా ఎదిగే అర్హత మీకంటే మరెవ్వరికి లేదని ప్రజలు ఇప్పటికి నమ్ముతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివస్తారు. ఎన్ని సార్లు చూడలేదు ఇటువంటి ఆశల తో కూడిన మీటింగులు. మీకు తెలిసిన విషయమే. ప్రతి పంచాయితీ లో మీ ప్రతినిధి గా ఉండడానికి నూతనంగా ఎదిగి వచ్చే లీడర్లు ఉన్నారు. మంచి కోరే వారు ప్రతి గ్రామం లో ఉన్నారు. వారి తో పాటు మీరు నేర్పిన రాజకీయాలు వంట బట్టుకుని ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నియ్యత్ గా బతుకుతున్న పెద్ద మనుషులు ఉన్నారు. విద్యార్థులు యువజనులు ఏ రాజకీయ పార్టీలకు అనుబంధంగా లేని గ్రూప్ లు గా ఉన్నారు. సమాజం కోసం ఏదో ఒక మంచి చేయాలని ఎదురుచూస్తున్నారు. కొన్ని సార్లు అవకాశ వాద రాజకీయాల వలన మోసపోయారు కూడా.
సాయుధ పోరు తో మిమ్మల్ని అభినయనించే ప్రేమించే వాళ్ళందరికీ దూరమై ప్రజలకు రక్షకులుగా ప్రజల గొంతుకలుగా ఉండ వలసిన మీరు మీరే ఆత్మరక్షణ లో పడి పోవడం ఏమిటి. శాంతి చర్చలకు ఉత్తరాలు రాయడమేమిటి. మీ అభిమానులు గంట గంటకు ఉత్కంఠ తో మొబైల్ ఫోన్లు టీవీలు చూస్తూ కూర్చుంటూన్నారు. మీరు అనుసరించే సిద్ధాంతాలను ఒక సారి సమీక్షించుకోవాలి. యుద్ధం జరుగుతుంటే ఇవేమీ ప్రవచనాలు అనిపించ వచ్చు. ప్రభుత్వం వాలకం చూస్తుంటే ఇరుపక్షాలకు నష్టం జరగవచ్చు. మీరు సాయుధంగా ఉన్నారన్న ఒక్క సాకుతో నే కదా మీ మీద ప్రభుత్వాల యుద్దం. పైగా ఈ యుద్దానికి అత్యధిక శాతం ప్రజల ను మౌనంగా ఉంచడానికి మరియు అంగీకారం ప్రభుత్వ చర్యలను అంగీకారం చేయించుకోవడం. ఈ మధ్య కాంగ్రెస్ మరియు సిపిఎం రెండు ప్రధాన పార్టీలు జాతీయ సమావేశాల్లో మీ పై జరుగుతున్న దమన కాండను ఖండిరచడానికి సాహసించలేదు.
అంటే అర్ధం అదే మీరు సాయుధంగా ఉండడమే. అసలు ఈ మారణ హోమాన్ని వెంటనే ఆపాలి. ప్రభుత్వమే చట్ట ఉల్లంఘన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. శాంతి చర్చలకు తయారు మేము అని అంటున్నప్పుడు ప్రభుత్వం పౌరుల మీద దాడులను ఆపాలి. ముఖ్యంగా ఆయధాలు ధరించని సామాన్య పౌరులు కూడా ఈ యుద్దం లో బలి అవుతారు. యుద్ద సమయం లో సాయుధ పోరు నిలిపి వేస్తే చులకన అయిపోతాము అని మీరు అనుకుంటే కనీసం ఈ యుద్ధం తరువాత నైనా ఆలోచించండి. విరమణ మీ రక్షణ కోసం కోసం కాదని అందరికీ తెలుసు. ఈ చర్య మీరు అయిదు దశాబ్దాల కింద మొదలు పెట్టిన ప్రజల బాగు కోసం పీడిత ప్రజల విముక్తి కోసమే అని మీ పార్టీని మిమ్మల్ని ఆలోచించమని కోరుతూ..
మీ అభిమాని
` వెంకట్ రెడ్డి, సామాజిక కార్యకర్త





