– కోమటిరెడ్డి కుటుంబ సుశీ ఇన్‌ఫ్రాకు సీబీఐ షాక్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 19: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చింది. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఈ లంచాల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుశీ ఇన్‌ఫ్రా నేరపూరిత కుట్రకు పాల్పడిందంటూ దిల్లీ సీబీఐ అధికారులు ఎఫఐఆర్ నమోదు చేశారు.సీబీఐ నమోదు చేసిన ఆ ఎఫఐఆర్‌లో మంత్రి కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ ఎ`15 గా ఉన్నది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్‌కు భారీగా లంచాలు ఇచ్చినట్టు సీబీఐ విచారణలో బయటపడింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని పనుల కోసం అధికారులకు సుశీ ఇన్‌ఫ్రా లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది.సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ అకౌంట్లలో దాదాపు రూ.1 కోటి వరకు సుశీ ఇన్‌ఫ్రా లంచాలు జమచేసినట్లు తేలింది. దీన్ని సీబీఐ ఆధారాలతో సహా బయటపెట్టింది. కేసుకు సంబంధించి ఎఫఐఆర్ కాపీని విడుదల చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





