Category Uncategorized

పాతకారు తుక్కుగా ఇస్తే..కొత్తకారులో డిస్కౌంట్‌

‌కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ ఆఫర్‌ ‌న్యూదిల్లీ,ఆగస్ట్ 27: ‌కొత్త కారు  కొనే వారికి కేంద్రం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది.  పాత వాహనాల్ని తుక్కు కింద సమర్పించి వాలిడ్‌ ‌డిపాజిట్‌ ‌సర్టిఫికెట్‌ ‌చూపిస్తే కొత్త కారు కొనుగోలుపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ‌ను కల్పించింది. కమర్షియల్‌  ‌లేదా ప్యాసెంజర్‌ ‌వాహనాల తయారీ కంపెనీలు కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్‌…

అత్యాచారాలకు వెరవని మృగాళ్లు

నర్సింగ్‌ ‌విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం ముంబయి, ఆగస్ట్ 27: ‌కోల్‌కతా వైద్యురా లిపై హత్యాచారం ఘటన యావత్‌ ‌దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లైంగిక దాడు లను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురా వాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగు తున్నాయి. అయినప్పటికీ మహి ళలపై అరాచకాలు ఆగట్లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో ఘటన చోటు చేసుకుంది.…

రాజకీయపార్టీలు గాడిన పడతాయా?

రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం లేదా? వీటికి సంబంధించి నిధుల సేకరణ, నిర్వహణ, హామీల అమలు తీరును ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ఇష్టానుసారం రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చా క వాటిని విస్మరిస్తే ప్రజలు ఏం చేయాలి? ఐదేళ్లు భరించి ఆ తర్వాత ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించడమేనా? మరో మార్గం…

ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై ఒద్దిరాజుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

తెలుగు సాహిత్యంలో ఒద్దిరాజులది ప్రత్యేక స్థానం •వారి రచనలు, సాహిత్యం, నవలలు మెచ్చని వారులేరు.. •ఒద్దిరాజుల పాండిత్యానికి పీవీ సాష్టాంగం.. •తెనుగు పత్రిక నడిపిన తీరు అమోఘం •పత్రిక ద్వారా నిజాం, బ్రిటిషర్ల దురాగతాలను వెలుగులోకి.. •సీనియర్‌ ఎడిటర్‌ ‌దేవులపల్లి అమర్‌ •మానుకోటకు వారి పేరు పెట్టాలి : ఒద్దిరాజు చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌చైర్మెన్‌ ఒద్దిరాజు…

Breaking: కవితకు బెయిల్

దిల్లీ మద్యం పాలసీ కేసులో బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత మార్చ్ 15 న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తిహాడ్ జైలులో ఉన్న కవితకు మంగళ వారం దేశ అత్యున్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. సొంత పూచి కత్తు,…

‘తెనుగు’ ఎగరేసిన చైతన్యబావుటా నేటి తరానికీ వెలుగుబాట

బహుముఖ ప్రజ్ఞకు ఉదాహరణగా నిలిచిన ఒద్దిరాజు సోదరులు స్థాపించిన ‘తెనుగు’ పత్రిక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసింది. చైతన్యబావుటా ఎగురవేసింది. ఇనుగుర్తి కేంద్రంగా మొదలై, జనసామాన్యానికి వెలుగు చూపింది ‘తెనుగు’. భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నిరుపమానమైన ప్రతిభ కనబర్చిన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులుగా లబ్ధప్రతిష్టులయ్యారు. కేవలం…

సంచార విజ్ఞాన సర్వస్వాలు ఒద్దిరాజు సోదరులు

తొలి తెనుగుపత్రిక శత సంవత్సర వేడుకలు ఆధునిక తెలంగాణ చరిత్ర రచిస్తున్నప్పుడు ఆవశ్యం ప్రస్తావించవలసినది ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వాన 1922 ఆగస్ట్‌ నుంచి 1928 వరకు వెలువడిన ‘‘తెనుగు పత్రిక’’. ఈ శతబ్ది ప్రారంభంలో తెలంగాణా ప్రాంతంలో విజ్ఞాన చంద్రికలను, సాహిత్య సౌరభాలను వెదజల్లిన మహనీయులు, మహా మనీషులు, అత్యున్నత స్థాయి మేధావులు, సారస్వత మూర్తులు,…

ఎమ్మెల్యేలు పార్టీ మారితే పదవిని రద్దు చేయాలి

కాంగ్రెస్ తో ఐక్యత ఉన్నా సమస్యలపై పోరాటం హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హనుమకొండ : ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేల పదవిని తక్షణమే రద్దు చేసే విధానం రావాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని…

పంచుకోవడానికి పంచాయితీ ఎందుకో?

ప్రపంచంలో వివక్షతను గురైన సమూహంలోనే వివక్షకు గురికావడం అనేది వేరే దేశాల్లో ఐతే చాలా అరుదు.. కానీ భారతదేశంలో చాలా సహజం. అందుకు కారణం ఈ దేశంలోని హిందూ వర్ణ వ్యవస్థ. దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో కిందకి పోతున్న కొలది వివక్షకు గురవుతున్న సమూహంలోనీ సభ్యుల…