Category తెలంగాణార్థం

అబద్ధాలతో, ప్రగల్భాలతో మూసీ అభివృద్ధి!!

 “మూసీ అభివృద్ధి భాగస్వాములతో సమావేశం అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రజలు లేరు. అంతర్జాతీయ, దేశీయ రుణదాతల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, నగర ప్రణాళికావేత్తలు, భవన నిర్మాణ నిపుణులు, నిర్వాహకుల దృష్టిలో మేధావులు వగైరా ఎందరో ఉన్నారు గాని మూసీ అభివృద్ధి ఎవరికి…

తెలంగాణ మీద పశ్చిమాసియా యుద్ధపు దెబ్బ

“ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దురహంకార, అధర్మ యుద్ధం గురించి ఎక్కడో నాలుగువేల కిలోమీటర్ల అవతల, మనకు సుదూరంగా యుద్ధం జరుగుతున్నదని, దానితో మనకు సంబంధం లేదని అనుకోవడానికి ఏమీ లేదు. ఇరాన్ (దాని పాత పేరైన పర్షియా) కూ తెలంగాణకూ శతాబ్దాలుగా పాత చుట్టరికం ఉంది. ఇరాన్ తో మనకు అనేక రకాల…

వెలుగుమట్ల వెలుగులు ఆర్పినదెవరు? ఎందుకు?

Land, Power, and Discontent in United Andhra Pradesh

“భూదాన భూములు దేశవ్యాప్తంగానూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అతి ఎక్కువగా అత్యంత దారుణమైన కబ్జాలకు, ఆక్రమణలకు, అన్యాక్రాంతానికి బలి అయిపోయాయి. ఎక్కడైనా భూదాన భూమి ఉందని తెలిస్తే చాలు, రాజకీయ నాయకులు, అధికారులు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి దాన్ని స్వాహా చేయడం ఎట్లా అని ఎత్తులకు పై ఎత్తులు వేశారు. భూములను ఆక్రమించారు.…

మూసీ బకాసురీకరణలో సామాన్యుల జీవనమెట్టిది!  

“అత్యవసరమైన డిపిఆర్ తయారు కాకుండానే, అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు, నివాసులకు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని భూములు, ఇళ్లు వదిలేయాలని నోటీసులు పంపుతున్నారు. పనులకు టెండర్ ప్రకటనలు ఇస్తున్నారు. కొందరినైతే ఏడాదిన్నర కిందనే బుల్డోజర్లతో తొలగించారు. పథకానికి అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గరికి వెళుతున్నామని, ఏషియన్…

ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!

“భారత ప్రజాస్వామానికి అత్యంత కీలకమైన పరీక్ష ఇక్కడే ఉంది. భారత పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలలో  పార్టీలూ, సిద్ధాంతాలూ, భావజాలాలూ, నిబద్ధతలూ, విధేయతలూ, కనీసం సిగ్గు ఎగ్గులూ ఏమీ లేవని, అధికార కాంక్ష, ప్రతిఫలాపేక్ష, లాభాపేక్ష, స్వార్థం, అవకాశవాదం మాత్రమే ఉన్నాయని దశాబ్దాలుగా రుజువవుతున్న విషయమే మళ్లీ ఒకసారి రుజువయ్యే మహత్తర అవకాశాన్ని తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు…

ఇదా ప్రజాస్వామ్యం?!

“రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత గడిచిన రెండు వారాలలో నాయకుల ప్రచార సరళినీ, ఒక పార్టీ మీద మరొక పార్టీ చేసుకుంటున్న ఆరోపణల ప్రత్యారోపణలనూ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్నీ, వోటర్లను ప్రలోభపెట్టడానికి సాగుతున్న ధన కనక వస్తు వాహన విచ్చలవిడి పంపిణీలనూ చూస్తే ప్రజాస్వామ్యానికీ ఈ ఎన్నికలకూ ఏమన్నా సంబంధం ఉన్నదా అని అనుమానం…

వ్యక్తి మరణం కాదిది, సమాజ మరణం!

  “కారు పార్కింగ్ స్లిప్ మీద “నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితం భారంగా ఉంది. ఇష్టం లేని జీవితం గడపాలని లేదు. పిల్లలను వదిలి వెళ్లలేక నాతోపాటు తీసుకెళ్తున్నా” అని రాసిందని తెలుస్తున్నది. తల్లి వైపు నుంచి చూస్తే తనకు దుర్భరంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో తాను వెళ్లిపోయాక తన పిల్లల బతుకు…

బొగ్గు బుక్కని వారెవరు?!  

“మొత్తం మీద ఈ వ్యవహారంలో శోధ కన్ స్ట్రక్షన్స్, సృజన్ రెడ్డి, నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, జి ఆర్ ఎన్ అండ్ మహాలక్ష్మి, వారాహి జీకే ఆర్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్, సుశీ హైటెక్ వంటి పేర్లు బైటికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇంకా పేర్లు బైటికి రాని కనీసం అరడజన్ కాంట్రాక్టర్లు అందరూ…

ఆ మాటల అర్థం తెలంగాణ ద్రోహం, నిరంకుశత్వం!

“కొన్ని పదవులు అధిరోహించిన వ్యక్తులు కనీసం ఆ పదవికి ఉండే గౌరవాన్ని కాపాడడానికి, ఆ పదవికి ఉండవలసిన తటస్థ, ప్రజాస్వామిక స్థాయిని నిలపడానికి తమ నోటిని అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. తమ వాచాలత్వాన్ని సమయ సందర్భాలను బట్టి తగ్గించుకోవలసి ఉంటుంది. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో అధినేతగా ఉండే వ్యక్తి తన లోలోపల ఎంత దౌర్జన్య, నిరంకుశ…