Category తెలంగాణ

పటేల్ చూపిన బాటలో పయనించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : భారత జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని బిజెపి రాష్ట్ర శాఖ కోశాధికారి షేక్ రేహమతుల్లా అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారతరత్న పటేల్ జయంతిని…

అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎంపిపి పటేల్ విజయ్ కుమార్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 1:  దౌల్తాబాద్ మండలంలోని  చెల్లపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎంపిపి పటేల్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందరూ వాడు కొందరి వాడు కాదు అన్నారు.ఈ రోజూ మన అందరం కలిసి మేలిసి ఉన్నాము అంటే దానికి కారణం…

మల్లారెడ్డి సమక్షంలో బీఆరెస్ లోకి యువత

  ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ శివాజీ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజా నాయక్, విక్రమ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 600 మంది యువత బుధవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరారు . ఈ సందర్భంగా రాజానాయక్ మాట్లాడుతూ, మల్లారెడ్డి చేస్తున్న…

బిజెపి నాయకుల మాటలన్నీ అబద్ధాలే యువజన అధ్యక్షుడు  కొమ్ము ప్రశాంత్

ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : బిజెపి నాయకులు అబద్ధాలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పోచారం బిఆర్ఎస్ యూవజన సంఘం అధ్యక్షులు కొమ్మ ప్రశాంత్ హెచ్చరించారు. పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం కొమ్ము ప్రశాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపి నాయకులు బిఆర్ఎస్…

హైసియా, మోంట్ గోమరీ కౌంటీ అవగాహనా ఒప్పందం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా), మేరీలాండ్లోని మోంట్ గోమరీ కౌంటీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆ సంస్థల ప్రతినిధులు బుధవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్, మోంట్ గోమరీ కౌంటీ మధ్య స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం…

నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: ఏ అబాగ్యరాలు కన్నదో ఏమో కానీ నవజాత శిశువును కుక్కలు పీక్కు తిన్న సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ లో చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అప్పుడే పుట్టిన శిశువును ఒక బ్యాగులో తెచ్చి చెట్ల పొదల్లో…

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 1: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.బుధవారం అమీన్ పూర్ లో…

సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి

జగదేవపూర్,ప్రజాతంత్ర, నవంబర్ 1: సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి ని చేస్తాయని రాష్ట్ర కార్యదర్శి ఎలివేటి రాధాకృష్ణశర్మ, రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన శ్రీ కొండచమ్మ ఆలయం వద్ద టిఆర్ఎస్ ప్రచార రథం వారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా…

హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డిలు విమర్శించారు.మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడిని వారు ఖండించారు.బుధవారం రామచంద్రాపురం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…