Category తెలంగాణ

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో మామపై కోడలి విజయం

జగిత్యాల, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 14 : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రతి క్షణం ఉత్కంఠను రేపుతుండగా, మరోవైపు కుటుంబ రాజకీయాల మధ్య ఆసక్తికర పోటీలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంనగర్ గ్రామంలో జరిగిన రాజకీయ సమరం ప్రత్యేక ఆకర్షణగా…

నేను బీఆర్‌ఎస్‌ వీడటానికి హరీశ్‌రావు కారణం కాదు

– కాంగ్రెస్ నేత‌ జగ్గారెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14 :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో నుంచి బయటకు రావడానికి హరీశ్‌రావు కారణమని చేసిన ఆరోపణలను ఖండించారు. కవిత చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాను హరీశ్‌రావుపై కోపంతో కాంగ్రెస్‌లోకి…

మ‌ల్ల‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన కేటీఆర్‌

– హ‌తుడి కుటుంబానికి రూ.5ల‌క్ష‌ల సాయం అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్ర‌త్య‌ర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి…

19న బీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం

– అనుస‌రించాల్సిన వ్యూహంపై కేసీఆర్ మార్గ‌నిర్దేశం – రాష్ట్ర రైతుల ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టంపై చ‌ర్చ‌ – ప్ర‌జా ఉద్య‌మాల‌పై స‌మాలోచ‌న‌ – ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించిన పార్టీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: ఈనెల 19న బీఆర్ ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం అధ్య‌క్షుడు కె.సి.ఆర్‌. అధ్య‌క్ష‌త‌న జ‌రుగ‌నున్న‌ట్టు పార్టీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా…

‘సర్’ పేరుతో కొత్త కుట్రలు

– పేద‌ల‌కు ఓటు హ‌క్కు వ‌ద్ద‌న్న ఆర్ఎస్ఎస్ నేత‌లు – ఓటు చోర్‌.. గ‌ద్దీ చోడ్ స‌భ‌లో రేవంత్‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: మహాత్మా గాంధీ, అంబేడ్కర్ రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు విషయమై చర్చిస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ నేతలు గోల్వాల్కర్ తదితరులు వారికి ఓటు…

న్యూ ఇయర్‌ ‌వేడుకలకు అనుమతి తప్పనిసరి

– పోలీసుల మార్గదర్శకాలు జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు13:న్యూఇయర్‌ ‌వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ ‌పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు.. వేడుకల కోసం 3 స్టార్‌ ‌హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లు ముందుగానే అనుమతి తీసుకోవలని పోలీసులు తెలిపారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు,…

దగా పడుతున్న శ్రామికులు

ఔట్ సోర్సింగ్ సేవకు న్యాయం ఎక్కడ? – ప్రభుత్వ వ్యవస్థలో ఐదు లక్షల మంది శ్రమ దోపిడీ – కొత్తవారికి రక్షణ, పాతవారికి నిర్లక్ష్యం – అధికారులు, ఏజెన్సీల విషవలయంలో పడి విలవిల – ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన                      …

‘స‌మ్మిట్‌’ చివ‌రి రోజు భారీగా సంద‌ర్శ‌కులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13ః ఫ్యూచ‌ర్ సిటీలో ఈ నెల 8 , 9వ తేదీలలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వహించిన గ్లోబ‌ల్ సమ్మిట్ ప్రాంగణాన్ని చివరి రోజైన శనివారం రైతులు, విద్యార్థులతోపాటు ఇత‌రులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. ఉదయం నిర్వ‌హించిన సెష‌న్‌లో ప్రస్తుత పద్ధతుల నుండి భవిష్యత్తు శ్రేయస్సు వరకు రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన…

ముగిసిన రాధాగోవింద రథయాత్ర

– భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాదిమంది భక్తులు హైదరాబాద్. ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 13 : హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శ్రీ రాధా గోవింద రథయాత్ర కోకాపేటలో అత్యంత వైభవంగా జరిగింది.వేలాదిమంది భక్తులు పాల్గొని సంస్కృతి, సాంప్రదాయాలతో రథయాత్రను మహోత్సవంలా జరుపుకున్నారు. రథంలో ఉంచిన‌ రాధాగోవిందుల సుందరమైన విగ్రహాలు దివ్య రూపంలో విరాజిల్లగా, భక్తులు…