Category ప్రత్యేక వ్యాసాలు

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

“అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఏర్పడిన 66ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని నవంబర్‌ 26, 2015న జరుపుకుంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపు కోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలా 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే…

భవన నిర్మాణరంగంలో ఆధునికతకు ఆద్యుడు పెంట నారాయణ

అఖండ భారతంలోని కరాచీ నగరంలో జన్మించిన ఒక తెలుగు వ్యక్తి ముంబయి నగరానికి వచ్చి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణ రంగాన్ని ఒక మలుపు తిప్పుతాడనీ, భవన నిర్మాణ రంగంలో సరికొత్త ప్రయోగాలతో ప్రయోజనాలు కలిగిస్తాడనీ 1896లో ఎవరూ ఊహించి ఉండరు. పెంట నారాయణ 17 ఫిబ్రవరి, 1896 నాడు కరాచీ నగరంలో జన్మించారు.…

హృదయాల్లో సుస్థిర స్థానం … నవంబర్ 24తో ముగిసిన ధర్మేంద్ర యుగం

భారతీయ హిందీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహా నటుల్లో ధర్మేంద్ర ఒకరు. సగం శతాబ్దానికి పైగా తన నటనా ప్రస్థానంతో కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించిన ఈ మహానటుడు నవంబర్ 24, 2025న తన 90వ ఏట తుది శ్వాస విడిచి మహా ప్రస్థానం చేశారు. ఆయన మరణం భారత సినీ…

దండకారణ్యం ఓ విఫల ప్రయోగం!?

Is Dandakaranya a Failed Experiment? Unpacking Decades of Development and Displacement

“సాయుధ పోరాట పంధా ఎంచుకున్న పీపుల్స్ వార్, బీహార్ యం సి సి తో కలిసి 2007లో మావోయిస్టు పార్టీగా మార్పు చెందింది. తెలంగాణా క్యాడరే దండకారణ్యంలో మావోయిస్టు సిద్దాంతం అమలుకు పూనుకున్నారు. వ్యూహాత్మకంగా అటవీ ప్రాంతం కావడం,మూలవాసీ మూలాలు ఉన్న గిరిజన ప్రజల్లో పట్టు సాధించడం వలన ఉద్యమం తొలిదశలో విస్తరణ వేగంగానే జరిగింది.…

టార్గెట్ రాహుల్..కాంగ్రెస్ చీలికకు మోషాలు కుట్ర..!

“ఇన్ని రోజులు ప్రాంతీయ పార్టీలను చీల్చిన మోదీ ఇక ముందు కాంగ్రెస్ ను చీల్చుతామని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి కుటుంబ సభ్యులు, లాయలిస్ట్‌లకు ఎర వేసింది..దిల్లీ నుంచి గల్లీ వరకూ లోకల్ పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చామని మోదీ ప్రకటన సారంశంగా చూడాలి. విభజన పాలిటిక్స్‌తో బలం పెంచుకున్న బీజేపీ ఇక ముందు కాంగ్రెస్‌ను…

రక్తసిక్తమైన రహదారుల్లో ఆర్తనాదాలు ఎన్నో ?

“ముఖ్యంగా హైవేలపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం తప్పుపట్టింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో పాటు ,తగిన కార్యాచరణ లోపించడమే రోడ్డెక్కుతున్న వారికి శాపమవుతోంది. 2024 లో యాక్సిడెంట్లలో చనిపోయిన నిర్భాగ్యుల్లో 65శాతం 18-45 ఏళ్ల లోపువారే. యువశక్తిని అలా నష్టపోతుండటం, క్షతగాత్రుల చికిత్స వ్యయభారాలతో…

పోలీస్ హెచ్చరిక vs ప్రజల ఆవేదన.. ఎవరి గొంతుక నిజం?

“ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న దాడులు కేవలం చట్టవిరుద్ధమైన చర్యలు మాత్రమే కాదు, ప్రజలు మరియు పాలకుల మధ్య విశ్వాసం పూర్తిగా సన్నగిల్లడం వల్ల తలెత్తిన లోతైన సంక్షోభానికి నిదర్శనం. ఈ పరిస్థితిలో ప్రజల ఆగ్రహం సరైనదేనా లేదా దాడులు చేయడం సరైనదేనా అనే కన్ఫ్యూజన్ స్పష్టంగా ఉంది. ఒకవైపు, అధికారులు అవినీతికి పాల్పడి, పనులను ఆలస్యం…

భారతీయ వలస కార్మికులకు రక్షణ

“ఓవర్సీస్ మొబిలిటీ బిల్లు, 2025 అనేది విదేశీ ఉపాధి కోసం చూసే భారతీయ పౌరులకు ఒక ముఖ్యమైన భద్రతా కవచంగా, మరియు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ శ్రామిక శక్తిని గౌరవప్రదంగా ప్రాతినిధ్యం వహించే ఒక సాధనంగా రూపొందించబడింది. ఇది పాత వ్యవస్థకు స్వస్తి పలికి, భారతీయ వలసలలో పారదర్శకత, సంక్షేమం మరియు క్రమబద్ధీకరణకు కొత్త ద్వారాలు…

హ‌సీనా ఉరిశిక్ష వెనుక‌….

“నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో ప్ర‌స్తుత అనిశ్చితి పాపం అమెరికాదే! ఎందుకంటే తాను సైనిక స్థావ‌రాన్ని నెల‌ కొల్పుకోవ‌డానికి బంగ్లాదేశ్‌ స‌మీపంలోని సెయింట్ మార్టిన్ ద్వీపం త‌న‌కు ఇవ్వ‌మ‌ని నాటి జోబైడెన్ ప్ర‌భుత్వం కోర‌గా అందుకు హ‌సీనా అంగీక‌రించ‌లేదు. అప్ప‌టినుంచి ప‌గ‌బ‌ట్టిన అమెరికా, బంగ్లాదేశ్‌లో అస్థిర‌త‌ను రెచ్చ‌గొట్టి చివ‌ర‌కు ఆమెను ప‌ద‌వీచ్యుతురాలిని చేసి, ఆర్థిక వేత్త యూన‌స్‌ను…