Category Shoba

అపారవశ్యం

మంచు కురిసిన పరిసర పసిరికల్లో ముసుగు వేసుకున్న ఆమె తెల్లని చేతుల దోసిట్లో కొన్ని నిన్నటి ప్రేమ బిందువులు పెదవుల్లో ఉబికి రాని దాటని మాటలు ఆ వనంలో రెక్కలు విదిలీయని పక్షుల్లా విరబూయని పువ్వుల్లా చీలిన చిగురుల్లా నిశ్చలంగా మూలుగుతున్న వృక్షాల్లా ఒక నిశ్శబ్ద నిరసన గీతాన్ని పాడుటకు సిద్ధంగా ఉన్నాయి ఆమె అనుమతికై…

నువ్వూ…నేనూ…వెన్నెల

మనమిద్దరం తొలి సంధ్యలో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు తొలికిరణాల స్పర్శతో పులకించిపోయిన ఎన్నెన్ని పూల బాసలు! ఆకాశమే హద్దుగా కిలకిలలాడిన ఎన్నెన్ని పక్షుల ఊసులు! ఆనందమే ఆశయంగా చిగురులు తొడిగిన ఎన్నెన్ని వసంత రాగాలు! మన సంతోషాలతో జత కలిపిన ఎన్నెన్ని తొలకరి జల్లులు! మన ప్రయాణంలో మనమధ్య బద్దలైన అగ్నిపర్వతాల ఎన్నెన్ని విస్పోటనాలు! మన కోపాలతో…

అర్దాల ఏకమే!

రోజు అంటే… రేయింబవళ్ళ చలనమే! సంవత్సరము అంటే రెండు ఆయనాల ఆవృతమే! దారికి తెలియని గమ్యం రెండు పాదాల గమనమే! పగలు – రేయికి రాజులు ఆ సూర్య – చంద్రులే! కారు చీకటి మబ్బుల్లో మిలమిల మెరుపుల ఉరుములే! వినీలాకాశానికి అందం మిలమిల మెరిసే తారక లే! జీవులు పుట్టుట- గిట్టుట పెరిగి -విరుగుట…

మారని చరిత

తనకెన్ని సమస్యలెదురైన బెదరక అడుగేసేటోడే నేటిమనిషి తన ఉనికికే ఎసరొచ్చినా ఏంమాట్లాడని మౌనముని బతుకెంత భారమైన బాధపడతాడే తప్ప కారణాలెతకడు ఎందుకంటే ప్రతిదానికి కారణమతడేగనుక చెమటను చిందిస్తూ చింతలేక బతికిన దినాలెన్నో రేపటికై చింతలేనోడొకపుడు తెలిసిన తెలియకున్నా చేసే పనిలో న్యాయముండేది నాయకుడైనా అనాముకుడైన జీవనగమనంలో సంతోషం వెతుకునేటోళ్ళు లోకంలోకొచ్చింది ఇచ్చిపోవడానికని తోచినంతలో మంచికై ముందడుగేసేవాళ్ళు…

నేను ఒంటరిని…

అవమాన బాణాలు ఎదలో గుచ్చుకొంటుంటే అటు సంద్రంలోని ‘‘అసని’’ తుఫాను ఇప్పుడు నా ఎదలోనూ మొదలయ్యింది. వర్తమానం నచ్చక భవిష్యత్తు గోచరించక, ఆలోచనల అలలు ఎగిసిపడుతూ సతమతమవుతోన్న  మదిలో ఉన్న ఆవేదనకు మరో ఆవేదన తోడవుతోంటే ఆవేదనా మబ్బులు కమ్మిన ఎదలో కన్నీటి వర్షం కురుస్తోంది. ఎన్నో నియంత్రణల కంచెలు వేసుకొని నడిచే జీవచ్ఛవంలాంటి యాంత్రికమైన…

పుట్టెడు దుఃఖం

పిలవని పేరంటమైంది హఠాత్తు గా ఊడి పడింది నోటికాడికి వచ్చింది మింగేసింది మండుటెండలలో మడత పెట్టేసింది ఉరమని పిడుగై ముంచ్చేసింది రైతన్నలను ఉసూరు మనిపించింది ఎప్పుడైనా ఈ వింత చూసామా అనిపించింది బ్రహ్మం గారి వాక్కు నిజ మనిపించింది పంట విరగ పండింది రేటు బాగుంది రైతు రాతను మార్చేసింది అప్పుల సుడిలోంచి బయట పడేసే…

అమ్మ

నెల తప్పింది మొదలు అంబరమంత ప్రేమ పంచుతూ, అష్టకష్టాల పిదప అమ్మతనం సొంతం కాగా అవధుల్లేని ఆనందం పొందుతుంది మాతృమూర్తి. బిడ్డలకైజి అహర్నిశలు ఆరాటపడే అనురాగవల్లి , వారి హృదయాలలో వెలిగే ఆనందజ్యోతి ఆమె.   అనురాగాల పందిరికి లతలా అల్లుకుపోతూ, క్షణం తీరికలేని బతుకు గడియారంలో అందరినీ చదువుతూ, ఓర్పు,సహనాలతో బతుకు అర్ధాన్ని లిఖిస్తూ,…

ఏది సత్యం?ఏదసత్యం??

నువ్వు ఏం మాట్లాడినా నీ నొసటిమీద కుంకుమ బొట్టులా ఒక ముద్రను అచ్చుగుద్దుతాడు వాడు గోడలకు సున్నం కొట్టినంత సులభంగా నీ మాటలకు లేని వింత వింత రంగులను పులుముతాడు పలుకుల్లో వినిపించని అర్థాలకు పండితోత్తములతో కొత్తభాష్యాలను పలికిస్తాడు మాట్లాడటమెంత నేరమో సాక్షాత్తు’’రాజ్యాంగం’’నోటితోనే పలికిస్తాడు నిజానికీ-అబద్ధానికి మధ్యగల ‘‘గీత’’ వాని అరచేతిలో కులుకుతూ కూర్చుంటుంది మాటల…

నాన్న

నాన్న…ఆ పదంలోనే ఆకాశమంత ప్రేమ, అమృతసమానమైన మాధుర్యం. బిడ్డకు ఊపిరి ఇచ్చింది అమ్మైనా, ఆ ఊపిరికి ఆలంబన నాన్న. గురువుగా నడకలు నేర్పి, గువ్వలా గుండెలో దాచుకొంటూ, పిల్లల బతుకుల్లో పున్నములు పూయించడానికి రేపటి కలల స్వప్న ప్రమిదలో తన చెమట చమురును పోసి తానే వత్తిగా కాలుతూ నిత్యం వెలుగులు పంచే అఖండ జీవనజ్యోతి…