Category Shoba

కాటికి చేరిన ప్రాయం!

వయసు ఉన్నప్పుడు ప్రణయం రాదు! ప్రణయం వచ్చే వరకు పరువం ఆగదు! హేమంతంతో సంగమం శిశిరంలో సాగితే! వసంతంతో సమాగమం ఉక్కపోతలో జోగితే! సోయలన్నీ జారిపోతూ సొబగులన్నీ జోలిపోతూ! వలపులకు, తలపులకు వియోగాలే మిగిలినవేళ! చెరుపులకు, మరుపులకు సంయోగాలే కలిగినవేళ! సింగారాలకు సిగపట్లు చాలక వయ్యారాలకు అగచాట్లు లేక! ఊహలు పుట్టని ఊసుల్లో కలలు రాని…

 ‌డోజర్ల దౌడులు

రాగద్వేషాల నాటకాలు.. భయ పక్షపాతాలకే.. పట్టం కట్టే కీచక పర్వాలు విభజించి పాలిస్తూ.. లక్షిత సమూహాలపై.. బుల్డోజర్లు దౌడుతీతలు ఉత్తర భారతాన కూల్చు వేతలు ! బుల్డోజర్‌ ఒక యంత్రమే కాదు.. భవనాల తలల్ని నరికే ఆయుధం విద్వేష విచ్ఛిన్న విధ్వంస చిహ్నం సామాన్యడి ఇంటిపై ఉక్కుపాదం నాగరికతను చూర్ణం చేసే డోజర్‌ ‌రాజ్యాంగ విలువలకు…

మెరుపు గింజలు

అక్కడ కొన్ని దేహాలు మాట్లాడతాయి కొమ్మలకు ఇప్పటికీ వేళాడబడి వుంటాయి అల్లంత దూరంలో గొంతులను పేర్చబడి చోద్యం చుస్తూ వున్న కొన్ని రాబందులు కుప్పల తెప్పల సంజాయిషీలు పడి వుంటాయి సైగలు చేసే చేతులు కాలే కడుపులు ఎండిన డొక్కలు దీనంగా చూస్తుంటాయి ఆ చూపుల తడిలో ఇప్పటికీ వెచ్చగా కొన్ని గింజలు మొలకెత్తుతుంటాయి చేసిన…

‘‘ ‌నిస్సహాయ జీవుల జీవిత ప్రస్థానం’’

చీకటి మింగేసిన జీవితాల్లో వెలుతురుకై పోరాటం… మబ్బుల కమ్మిన ఆకాశంలో ఇంధ్రధనస్సుకై ఆరాటం…. అసాధ్యమని తెలిసినా ఆశతో నెట్టుకొస్తున్న సగటు నిస్సహాయ జీవి జీవిత ప్రస్థానం… అచ్చెరువు గొలిపినా… ఎవరికీ పట్టని అంతులేని వింత ప్రయాణం. ఆటుపోట్ల మధ్య  జరిగే సంఘర్షణ. అలజడుల మధ్య ఏర్పడే  ఉప్పెన. అసహాయులకది పెను పోరాటం. నిత్యం జరిగే జీవన…

అసంపూర్ణ శిల్పాలు

అదిగో ఎన్ని ఉదయాలు తుడుచుకుపోతున్నాయి కదా అయ్యో ముడుచుకుపోయిన నీ మెదడు తీరిగ్గా లేదు నిజానికి జారిపోతున్న నిన్ను పట్టుకోవడానికి సన్నద్ధంగా లేదు ఒక ఆలస్యం సొమరితనం అసంతులనం తికమక అసాహసపు అసహనం వెరసి ఒక జడత్వం కదలనివ్వవు కదిలినా సాగనివ్వవు సాగినా సాఫీగా అవనివ్వవు ప్రశ్నలకు దాటు సమాధానాలు వెతుక్కునే సమాధానాలకేమో మెలిక ప్రశ్నలు…

కాలచక్రం

ఉదయమంతా తెల్ల చీర రాత్రయితే నల్ల చీర కట్టుకుని, అలవోకగా పయనించే కాలంతో నుదుటి కాగితం మీద అది విదిల్చిన అక్షరాలను కూర్చుకుంటూ ఆగు కాలమా అన్నాను ఆగను నాతో సాగమంది చక్రభ్రమణమే తన ధర్మమంది వాయిదా వాహనంపై సవారీ తగదు తగదంది నిరాశా ఫలాలను అందించి కర్తవ్యబోధ చేసింది. వానలెన్నో చూసి, ఎండలెన్నో కాగి…

ఎక్కడో? ఎప్పుడో?

అపరిచితులమే కానీ ఎక్కడో సుపరిచితులమే! మతికి గుర్తులేదు కానీ, మనసు జ్ఞాపకాల్లో ఎక్కడో తచ్చాడుతూ!   సన్నిహితులమే కానీ ఎందుకో సుదూరతీరాల్లో! మతికి దూరభారాలు కానీ, మనసు నీడల్లో ఎప్పుడో సేద తీరుతూ!   స్నేహితులమే కానీ ఎప్పుడో ప్రేమికులమే! మతితో మంకుపట్లు కానీ, మనసులో ముచ్చట్లు ఏనాడో మురిసిపోతూ!   ఇరువురమే కానీ ఎప్పటికీ…

మృగశిర

మృగశిర మురువాలి ఏరువాక సాగాలి శిరముతో దుక్కి దున్ను బసవన్నలకు శిరము వంచి మొక్కు మృగశిర తెచ్చు చల్లని వర్ష పవనం తగ్గించు ఊష్ణ తాపం మృగశిర నాడు తిను ఇంగువ బెల్లం జలుబూ, సర్దులకు బల్లెం మృగశిర కురిస్తే ఏరువాక మెరుస్తుంది ముసలెద్దు రంకె వేస్తుంది మఖ గర్జిస్తే సస్య లక్ష్మి పులకించు రైతన్న…

ఆటకు అల్విదా

కాంతల క్రికెట్‌లో కాంతి పుంజం మహిళా క్రికెట్‌కే మణిహారం అతివల క్రికెట్‌ను అందలమెక్కించి.. ఆటలో మెరిసి, ఆటను మెరిపించె మిరాకిల్‌ ‌లేడీ మన మిథాలీ రాజ్‌ !   ఒడుదుడుకుల్ని ఓర్పుగా సహించి.. క్రికెట్‌ ఆటను అందలమెక్కించి.. ఎన్నో మైలురాళ్లు ధీటుగా దాటుతూ.. ఫార్మాట్‌ ఏదైన రికార్డుల మోతలతో.. అధిరోహించె అసమాన్య కీర్తి శిఖరాలు !…