Category Shoba

పన్నుపోటు

సంపన్నుల పాలనలో పేదోడిబతుకు ఎండమావయ్యింది ఉన్నోడికి ఉన్నదంతా ఊడ్చిపెట్టడమే ఆనావాయితి పుడితే పన్ను చస్తే పన్ను సపాటుసాగాలంటే సరుకులెలా కొనాలో రూపాయి విలువతగ్గి జీవనం అతలాకుతలం జీవనోపాధి కల్పించని పాలకులు ఏకాకినిజేసేస్తూ చేతకానితనంతో దేశభక్తి గీతమాలపిస్తున్నరు ఏమనడిగితే చాలూ దేశద్రోహులౌతున్నరు ఈసురోమని పాలకులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ ఓట్లనన్ని దోచుకెళ్ళి షేర్‌ ‌మార్కెట్లో తాకట్టువెడుతున్నరు దోచుడే పరమావధిగా…

రాత్రి

ఎక్కడెక్కడో పుట్టిన ఎన్నెన్నో జీవితాల నదుల్ని సముద్రంలా అక్కున చేర్చుకొని సంఘటితపరుస్తుంటుంది… మోడువారిన శిశిరపు హృదయోద్యానంలో అనుభూతుల పూలపరిమళాల్ని వెదజల్లుతూ ఆమనిలా విరబూస్తుంటుంది… వేదన మంచులో వణికే హృదయాన్ని వెచ్చదనం తరంగాల్లో చలిమంటలా వోలలాడిస్తుంటుంది… పగుళ్లుదీసిన బ్రతుకు పుడమిమీద ఓదార్పు మేఘమై చినుకు చినుకుగా కురుస్తూ సేదదీరుస్తుంటుంది… మమతల ఉలితో మహత్తర శిల్పిలా రాతిగుండెకు సైతం…

‌మాట్లాడటానికేం ఉందని

మాట్లాడటానికేం ఉందని మాట్లాడుతూ ఉండటానికి ఎవరి ఉదయాలు, ఎవరి రాత్రుళ్లు వాళ్ళవయ్యాక ఎవరి ప్రపంచంలో వారు గిరికీలు కొట్టడం అలవాటు పడ్డాక ఎండిన నదీ పాయలో దోసెడు  నీళ్ళు కనబడతాయా? బీటలు వారిన నల్లరేగడి నేలలో విత్తు విచ్చుకుంటుందా? చిత్రకారుడు గీసిన రేఖా చిత్రాల్లా మనుషుల రూపాలు లోపల అంతా హ్యాలో భారరహిత స్థితిలా భావరహిత…

ఉషస్సు

కోయిల కూయాలా ఆమని రావాలా వెన్నెల కాయాలా కలువలు పూయాలా వానలు కురియాలా వసుధే నవ్వాలా ఉషస్సు రావాలా తమస్సు పోవాలా కిరణుడు రావాలా కమలమె విరియాలా పున్నమి రావాలా సంద్రం పొంగాలా తరువులు పెరగాలా కరువులు  తరగాలా పరువుగ బతకాలా పరుగులు ఆపాలా – గుండాల నరేంద్ర బాబు తిరుపతి హస్త వాణి:9493235992

మనసులు మారాలి

ఇదేమి లోకం…ఇదేమి లోకం? మానవత్వపు జాడ ఇసుమంతైనా కానరాని అమానుష లోకం. ఆర్తుల్ని ఆదుకొనేందుకు రెక్కలు కట్టుకొని కొందరు అహరహం  శ్రమిస్తోంటే, ఈర్ష్యా, అసూయలతో ఆ రెక్కలు నరికి బాధితుల ఆశలు సమాధిచేస్తే కాని విశ్రమించని జనులున్న పరమ కిరాతక లోకం. పాలనలో అ, ఆ లు రాకున్నా, దురాశతో అందలమెక్క పునాదులు లేని వాగ్దానాలు…

జవాబు జాడ చెప్పదు

నా కథలో అడుగుదూరంలో ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును దగ్గరగా విన్న ఇష్టం కలకు ప్రాణంపోసి…. ప్రవహించే ఊహగా పరిగెత్తె ఆశగా ఎంత వెతికినా నడక ఎవరిదై  ఉందన్న ఒక్క ప్రశ్న ఏ క్షణం కాళ్ళు పట్టుకున్నా జవాబు జాడ చెప్పదు. నెర్రెలు బారిన ఆశ పొడిబారిన కళ్లతో ఏనాడో పుట్టి పెరిగిన ఈ…

నిశిత సాహిత్య విశ్లేషణ…

నిరంతర సాహిత్య పఠనం విషయాత్మతో కూడిన విశ్లేషణాత్మకమైన రచనలను అందించడానికి రచయితకు తోడ్పడుతుందనడానికి సాక్ష్యంగా డాక్టర్‌ అమ్మిన  శ్రీనివాసరాజు రాసిన వ్యాసాలు కన్పిస్తాయి. అక్షరాభిషేకం పేరుతో ఇటీవల ఆయన  వెలువరించిన వ్యాస సంకలనంలో  దేనికదే ప్రత్యేకత కలిగి విభిన్నంగా అనిపించే ఇరవై వ్యాసాలున్నాయి. సృజనాత్మకతను పాటిస్తూ సాధారణ దృష్టితో  చూడబడే వ్యాసాన్ని ముందుకు నడిపించడం నిజానికి…

‌ప్రతిదీ ఒక జ్ఞాన ప్రతినిధి!

ప్రకృతి నీకు చెబుతుంది ప్రతి ఒకటి ప్రయోజనం కలదని ప్రకృతిలో వృధాగా ఏది లేదని ఉదహరించి చెబుతుంది ఈ భూమి కర్మల కార్మాగారం భువిని దివి చేయు భాండాగారం మంచిచెడు అనుభవాల కారాగారం ప్రతి మనిషి ఓ పనిమనిషి మనిషి లేకుంటే ఈ జగతి కలుపు తీయని పంట చేను గతి కృషితోనే ఈ జగతికి…

కలాంజీ మీకు సలాం

ఆయన… ఓ మహర్షి ఓ మహామనీషి ఆ అస్తిత్వం అద్వితీయం ఆ వ్యక్తిత్వం ఆదర్శనీయం ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ వర్ఛస్సు అఖండ తేజం ఆ మేధస్సు విజ్ఞాన బాండం ఓ శ్రామికుడు ఓ స్వాప్నినికుడు ఆ హాసం కడలి తరంగం ఆ చూపు కరుణామృతం ఓ సత్య శోధిత ఓ నిత్య విద్యార్థి…