Category Shoba

ఆవ్వ సుద్దులు

అసలే ఇది జనారణ్యం మానవమృగాలు సంచరిస్తాయ్‌ అ‌శ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా ! అడుగడుగునా  కాయం మీద కామనేత్రాలు నిఘా పెడతాయ్‌ ‌నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా ప్రేమంటూ కక్షగట్టి వేటేయ మధపుటేనుగలు మాటేస్తాయ్‌ ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో నిర్జనతావుల్లో అధనుచూసి నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు మేకవన్నెపులులు కాపు కాస్తాయ్‌ ఉదాసీనం…

పోరు పిడికిళ్ళు

కులం కత్తుల సాముచేసి తల తెగిపడ్డ మొండాలతో మనువుకు నైవేద్యం పెట్టండి మతం మంటలు రాజేసి దహించిన చితాభస్మంతో విగ్రహాలను ఆరాధించండి ఆధిపత్య విషం వెళ్లగక్కి చచ్చిన పీనుగల ఎత్తుకుని ఆలయ ప్రదక్షిణలు చేయండి నిరంకుశ కొరడా జులిపి చిందిన నెత్తుటి ధారలతో పాప పంకిలం కడిగేసుకోండి నల్లచట్టాల పలుగు వేటేసి బతుకుల నిలువునా కూల్చి…

ఆమె ఎన్నో…

ఆమె దాగేకొద్ది ఆ పరిచయానికి రుచెక్కువ. గొంతు దూరమయ్యేకొద్ది ఆ మాటలకు మత్తు ఎక్కువ. ఆమెలో మునిగేకొద్దీ ఆ లోతుకు దాహమెక్కువ. కాలం గడిచేకొద్దు ఆ జ్ఞాపకాలకు జీవమెక్కువ. ఆమెను చెప్పుకునేటప్పుడు మనసుకు వేగమెక్కువ తప్పుకుపోయేటప్పుడు ఆ బంధానికి భారమెక్కువ. ఆమెకు పంచేటపుడు భావాలకు భాధ్యతేక్కువ. పక్కనేఉన్నప్పుడు ఆ రోజంతా తీపెక్కువ. ఆమెను వ్రాసుకునేటప్పుడు కవితకు…

సమయం ఉందా?

మది హూంకరించిందేమో? మనసాక్షి కళ్ళు తెరిచిందిమో? పాపాల పుట్టలు పగిలి శాపాల తాపాలు రగిలాయో? పరితాపాల గుట్టలు కదిలి చింతల సెగలు కదిలాయో? భూమి కృంగుతున్న భావమో? భారపు పగ్గం తెగుతున్న భావనో? పాషాణపు మదిలో భూకంపాలు వచ్చాయో? జల ప్రళయాలు కలిగాయో? రాకాశపు మతిలో మనసు తడి తెలిసిందో? మమత జడి కురిసిందో? ఇంకిపోయిన…

మన ఆశయాల్లోంచే…

హృదయాలు హద్దుల్ని చెరిపేసుకొని ఆర్ద్రత భాషలో సంభాషించుకొనే సమయాలు మన ఆశయాల్లోంచే ఆవిర్భవించాలి… మన సౌభ్రాతృత్వపు చూపుల ధాటికి మతమౌఢ్యపు మహమ్మారి చేష్టలుడిగిజి మొహం చాటెయ్యాలి- సంకుచిత పరిధులు సతతం మాయమవ్వాలి… మోడువారిన సమైక్యత చెట్టు మళ్లీ చిగురించడానికి మనమే తొలకరులు కావాలి… మన హృదయోద్యానాల్లో మానవత్వపు ఆమని మనసారా విరబూసి మనిషితనపు పరిమళాల్ని మనచుట్టూ…

ఉన్నోడికే ఉన్నదంతా!

ఉన్నతవర్గాల మనుషుల మనసులు అణగారిన వర్గాల మనోభావాలను గంభీరంగా దెబ్బిపొడుస్తుంటాయ్‌ ‌వాన్ననిచిపెట్టాలనే కుటిలత్వాన్ని పైత్యంగ మార్చుకుని ఓ వికారాన్ని కనుసన్నల్లోనే ఒలికించే కుటిలవర్తనులు కులాలకుంపట్లనెపుడు రాజేసే రాతిమనుషులు వాళ్ళకెందుకో ఎంత చదివిన బుద్ది వికసించదు పెత్తనం చేయడమైతే చేతగాదిపుడు కానీ మాటలతోనే చిత్రవధ చేస్తున్న మహాజ్ఞానాన్ని ధరించిన మనువాద ఛాందసవాదులు సందుదొరికితే చాలు కులగజ్జిగాళ్ళ కళ్ళు…

తల్లిపాలు దివ్యామృతం

తల్లిపాలు శిశువుకు ఆది అమృతబాండం తొలి అపూర్వ ప్రాశనం ప్రథమ ఆరోగ్య ఔషధం జననీ స్తనము పాలు బిడ్డ పెరుగుదలకు మూలం మనో వికాసానికి ఉద్దీపనం సంపూర్ణ స్వస్థకు సహేతుకం మాతృమూర్తి ఎద క్షీరం భగవంతుడు ఇచ్చిన వరం ప్రకృతి ప్రసాదించిన భాగ్యం సహజ సిద్ధమైన సంజీవనం రోగనిరోధక శక్తి స్వరూపం పోషకపదార్థాల సమాహారం తల్లిబిడ్డల…

ఖబర్దార్‌..‌డ్రాగన్‌

‌నమ్మించి గొంతు కోయడం నీ వారసత్వ లక్షణమేమో అందుకే శాంతి మంత్రం జపిస్తూనే విద్రోహ తంత్రం రచిస్తావు మెత్తగా హత్తుకుంటూనే విచ్చు కత్తులు దూస్తావు నెయ్యానికి స్వాగతిస్తూనే కయ్యానికి తెగబడతావు చర్చలకు చేయి చాస్తూనే దుశ్చర్యకు ఒడిగడతావు చీకటి మూకలు ఎగదోసి దొంగవేటుకు పూనుతావు విరమణను ప్రకటిస్తూనే సరిహద్దుల అతిక్రమిస్తావు సత్తువను తక్కువని తలిస్తే సత్తెనాశనానికి…

‌శ్రావణమాస ప్రశస్తి

రేరాజు శ్రావణ నక్షత్రంలో సంక్రమించే శుభకర మాసం మహాలక్ష్మికి ప్రీతికర శ్రామం పండుగలకు నెలవైన కాలం ధైవనుగ్రహం పొందే ద్విపక్షం పరమ పవిత్ర శ్రావణమాసం దివ్యమాస ఆసాంతం పూజలు దైవరాధనలు భగవన్నామ స్మరణలతో మందిరాలు మారుమ్రోగేను గృహ సీమలు వెల్లివిరిసేను పుణ్యకాల ఆధ్యంతం పగలు ఉపవాస దీక్షలు రాత్రివేళ స్వామివారిని త్రికరణశుద్ధిగా కొలిచిన సకల పాపాలు…