Category Shoba

ఆకలి కసి

నిర్లక్ష్య వృక్షపు నీడన.. విజయ హరితం ఎదగదు నిరాశ మబ్బులు కమ్మిన.. కనిపించవు ఆశల వెలుగులు ! కష్టాల చెమట చుక్కల్తో.. చిగురించు సుఖ మొలకలు చదువు పట్టాల పంట చేనులో.. పండును జీవన సాఫల్య రాసులు ! పేదోడి ఆకలి కసి కృషి.. వర్షింపజేయు అన్నామతాన్ని అక్షరాల్ని విశ్వసించే మనిషి.. విశ్వవిజేతై ధరించు కీర్తి…

ఏమీటీ రాజకీయం

బాగుందా బాగుందా భారత దేశ రాజకీయ భావజాల భవితవ్యం. మునుపెన్నడూ ఎరుగని మితిమీరిపోతున్న కుల మత రాజకీయ విద్వేషాలు. అధికారం కోసం  అలుపెరుగని ఆరాటము కలవలేని వారితో కలగలసి కపటపు నీచ రాజకీయం రాజకీయ రణరంగంలో రాణించని నాయకులు ఓట్ల కోసం నోట్లతో నాటకాలు బూటకము. బాగుందా బాగుందా భారత దేశ రాజకీయ భావజాల భవితవ్యం.…

ఆకలి పాదం అడుగేసింది…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. తాజాగా మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది.…

పాక్‌ ‌ముసలి కన్నీరు

నెత్తురు తాగే వ్యాఘ్రం సాధుజీవి రూపమెత్తింది ప్రాణాల తోడేసే తోడేలు శాంతి మంత్రం వల్లిస్తుంది కత్తుల తెగదూసే కర్కశి మైత్రి హస్తం అందిస్తుంది విద్వేషం చిమ్మే కాలనాగు కరుణ రసము స్రవిస్తుంది తగవుకు తెగపడే ఉగ్రదేశం సామరస్యం స్వాగతిస్తుంది మూడు యుద్దాల తదుపరి గుణపాఠం నేర్చుకున్నామని పాక్‌ ‌కొత్త పాట పల్లవిస్తుంది ఇకపై శాంతియుత జీవనం…

సంక్రాంతి పండుగ

మనలోని కల్మషం అనే మురికిని మంటల్లో కాల్చి వేస్తూ భోగితో మొదలవుతుంది మూడురోజుల పండగ సంక్రాంతి! మన ఇంట చిన్న పిల్లలను రేన పండ్లతో ఆశీర్వదించేది ఈ భోగి నాడే! సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం రైతు పండించిన పంటను ఇంటికి తెచ్చేది ఈ సంక్రాంతి నాడే! పడతులతో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇంటి…

వెంటాడే హృదయపు వాక్యం…

తెలియక మనమంటాం పిల్లలని/ వయసు బరువు పడ్డాక రెక్కలు తెగిపోతాయి/  కాయలు పండిపోయాక పూలు కేవలం ఓ స్మృతి అని జీవన తాత్త్విక  కోణాలను స్పృశించారు ప్రఖ్యాత కవి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి. అనుభూతికి అక్షర సాక్ష్యంగా నేనే కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. జీవన గాఢతను పొదువుకున్న అంతరాంతర సీమల్లోని అభివ్యక్తులుగా ఇందులోని 49…

సూర్య గమనం సంక్రాంతి

విష్ణుమూర్తి రాక్షసజాతిని అంతమొందించిన రోజు మకర సంక్రాంతి. తమను అనేకరకాలుగా హింసిస్తోన్న అసురుల చర్యలకు తాళలేక దేవతలు మొర పెట్టుకోగా, విష్ణుమూర్తి రాక్షసులను హతమార్చి మందరపర్వతం కింద పాతిపెట్టాడు. కనుకనే మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకుంటాం. అశుభాలు, అపజయాలను తుదముట్టించిన దినంగా భావిస్తారు. అందుకే ఉదయానే నదీస్నానం చేసి సూర్యుడికి నమస్కరించుకుంటారు. నది గానీ చెరువు…

కామారెడ్డి అగ్ని కణాలు

మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌మాయ ముసుగులో.. పంటలకు నిప్పు పెట్టే కుతంత్రాలు సాగుబడి చేతులు నరికే నీతులు నేలతల్లి నిశ్శబ్ద నినాదాలకే కాదు.. కామారెడ్డి రైతు రౌద్ర కంపనాలకు.. ప్రభుత్వ నిర్ణయాలు జడిసే రోజులు ! మట్టి సత్తువ సలసల మసిలి.. కోపాగ్నితో ఎగిసి పిడికిలెత్తింది కొలిమిలో కర్రు మొన ఎర్రగా కాలి.. నిరసన చురకల వాతలు…

గుణపాఠం తప్పదు

నీ మురికి కంపు ఎత్తిపోసేది మేము నీ కుటిల కడుపుకు మెతుకు పెట్టేది మేము నీ చీకటి బతుక్కు దీపము పట్టేది మేము నీ నల్ల అంతస్తుకు పునాది వేసేది మేము నీ దోపిడీ సంపదకు కాపలా కాసేది మేము నీ రొచ్చు పీనుగకు పాడెను కట్టేది మేము డప్పుల కొట్టేది మేము నీ సర్వ…