Category Shoba

మృగాంతం

ఎలుక లున్నాయి పిల్లులున్నాయి కుక్కలున్నాయి దాడి శత్రుత్వం మనుష్యులున్నారు బానిసత్వం అణిచి వేత జీవులంతా తిండికై వేట… ఆకలి తీరని దాహం దాడులు ప్రకృతి సహజం మనిషి లోని మృగం మనిషి పైనే దాడి రాకాసి మృగం అంతమే మరోమనిషికి జీవం ఆది అంతా ల మధ్య సమరమే పరిష్కారం లేదా సంధియే సత్కృతి –…

(అ)స్పృహ

ఇంకెంతని ఏమని భరించగలదు ఈ దేహం బాల్యం నుండి గాయాలే కదా గతం నుండి యుద్ధాలే కదా ఇంకెంత కర్కషత్వం చవిచూసేది అవమానం అస్తిత్వాన్ని హత్య గావిస్తూ చిల్లులు పెడుతుంది ఆత్మాభిమానం ఆద్యంతం వద్దని వారిస్తది చూసే కళ్ళు కలిపే చేతులు నవ్వే మొహాలు ఎక్కడో తావు వెతుక్కున్నవే ఒకరిపై భారం పడొద్దు అనుకుంటూనే వాళ్ళ…

విముక్తి

ఏమోయ్‌ కాసింత కాఫీ ఇస్తావా? ఇస్తాలే గాని అంత బిజీగా ఏం ప్రిపేర్‌ అవుతున్నారు రేపటి ఉపన్యాసం గురించి అవునా… దేని గురించండి? విముక్తి గురించి ఏమోయ్‌ మధ్యాహ్నంకి కాసింత భోజనం ఎక్కువ చెయ్యవా ఏంటండీ అంత ఆకలిగా ఉందా? లేదులే! మా మిత్రుడొకరు ఓ చర్చ చెయ్యడానికి వస్తున్నారు అవునా… దేనిమీదండి? విముక్తి మీద…

నిర్భయంగా.. నిరాటంకంగా…

కవిత్వంతోనే/  నా ఊపిరి వెలిగించుకుంటాను/   కవిత్వంలోనే /   నా ఆయువు పొడగించుకుంటాను/  నా కవిత్వానికి/  నేనే వాక్యాంతాన్నవుతానన్నారు కంచరాన భుజంగరావు. నీటి గింజల పంట పేరిట వెలువడిన ఆయన సంపుటిలోని కవితలు వచన కవిత్వంలో సరికొత్త అభివ్యక్తికి ఉదాహరణలుగా కనిపించాయి. నాగలి వెంట నడిచే కవిని నేను /  కవిత్వమే నా కుడి…

ఆకాశం కథ!

ఒకప్పుడు ఆకాశం అంతా అంధకారంగా ఉండేది. ఆకాశం  భయపడలేదు? నిస్సత్తువని చేరతీయలేదు? సహనాన్ని, సమయాన్ని నమ్ముకుంది! వేకువ వచ్చే వరకు వేచి చూసింది. చివరగా విజయాన్ని చవిచూసింది! ఆవహించే అంధకారానికి సమాయత్తం అయ్యింది! నక్షిత్రాలని పొదుగుకుంది. మెరుపురవ్వల్ని దాచుకుంది! ఉల్కాపాతాన్ని రగుల్చుకుంది! దివాకరుడిని లాలిస్తూనే, రజనీకరుడిని కవ్వించింది! ఇప్పుడు చీకటంటే ఆకాశానికి ఓ కోలాహలం! ఓ…

జీవన ధైన్యం…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది. పొట్టపోసుకునేందుకు…

చెదరని గురుతులు

దినకరుడి కాళ్ళకి నా కళ్ళనతికించుకుని మరీ వెతుకుతాను నీ జాడ కోసం నిశి రాత్రిలో మిణుకు మిణుకు మిణుగురులు తళుకు తళుకు చుక్కలు తోడు నడుస్తాయి నా బాధ చూడలేక అప్పుడప్పుడూ…. పున్నమి వెన్నెల నా చేతిలో లాంతరై దారి చూపుతుంది ఏ పొన్నపూలో వాసనలొదిలి మనం ఏకాంతంగా కలుసుకునే చోట నీవున్నవనే జాడ తెలుప…

లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు హద్దుమీరిన తాయిలాల వర్షం వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా అమలుకు నిధులెక్కడివని అప్పుచేసి  పప్పుకూడు రీతిగా ప్రజలపై పన్నుల భారం తో దివాలాకోరు  ప్రభుత్వ విధానాలు అప్పులతో  ఎన్నికల  తాయిలాలు భూటకపు  వాగ్దానాలు . కరెన్సీ నోట్లు వెదజల్లే ఆచారం అధికారం కోసం…

విద్య ఓ వరం ఎందరికో జీవనాధారం…

అక్షరం ఆయుధం కన్నా గొప్పది.. అక్షరం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపుతుంది.. అక్షరంతో అజ్ణానం తొలగి పోతుంది.. ప్రతియేడాది సెప్టెంబర్‌ 8వ తేదీని ‘‘అంతర్జాతీయ అక్షరా స్యతా దినోత్సవం’’గా జరుపు కోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం, నవం బర్‌ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడిరది.…