Category Shoba

దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం

దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్‌పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే…

మహా అక్షరం శ్రీ శ్రీ

ఆ కలం కాలాన్ని గురిచూస్తు ప్రశ్నించే ఆయుధం….. ఆ భాష గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశం….. ఆ అక్షరం చీకటిలో అగ్గిలా వెగిలే పోరాటం…. ఆ కవితే తెలుగు నుదుట ఓ ప్రస్థానం… ఆ  కవిదే ఆంధ్రుల పాలిట మహాప్రస్థానం…. ఆ జయభేరే ఆధునికతకు నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం.. అతడే మహా కవితకు శ్రీకారం…

ఆం‌ధ్రా ‘‘షెల్లీ’’ దేవులపల్లి

ఆయన అక్షర తేజశ్వి అమర కవన యశశ్వి మధుర గీతాల మహర్షి సాహితీ ప్రపంచ రాజర్షి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య మాగాణంలో అక్షర సేద్యం చేసినవాడు సరిగమల సామ్రాజ్యంలో… పాటకు పట్టం కట్టినవాడు వెండి తెర యవనిక పైన నిండు వెన్నెలై కురిసాడు పద్య గద్య గేయ రచనలో కొత్త ఒరవడి సృష్టించాడు ఆకాశవాణిలో ప్రయోక్తగా…

వాడిపోని గాత్రమాధుర్యం

దివినుంచి భువికి దిగిన సంగీత రసాధిదేవత మనందరి కోసం స్వరసామ్రాజ్యాన్ని స్థాపించింది… వసంతమై ఎదల కొమ్మలకు వేల పాటల ఆమని సొబగుల మాధుర్యపు చిగుళ్లను తొడిగి మళ్లీ దివికి వెళ్లిపోయింది… అయినా ఎన్నటికీ వాడిపోని మనల్ని వీడిపోని ఆమె గాత్రపరాగపు పూల గుబాళింపుల్లో మన హృదయాలు వోలలాడుతూ పులకిస్తూనే వుంటాయి… ఒక జీవనదిలా ఆమె పలికించిన…

మృత్యు ఘోష

తరతమ భేదం లేదు జీవజాతి విచక్షణ లేదు పాప పుణ్యాల వివేకం లేదు పేద ధనిక వర్గీకరణ లేదు పసి ముసలి వ్యత్యాసం లేదు ముందస్తు హెచ్చరిక లేదు దాడి తీవ్రత అంచనా లేదు పగలు రాత్రి పరిమితుల్లేవు భూకంపానికి అందరూ ఒక్కటే ! కనివిని ఎరుగని భూప్రళయంతో.. కన్నీరాగని కోట్ల జన విలయాలు హఠాత్తున…

బొరుసునూ చూడు!

ఏమిటీ? నీవో గాయపడ్డ మనిషివా? ఆశల రెక్కలు తెగి వేదనాశ్రువులు నీ కలల కళ్ళను ముంచేస్తున్నాయా? కోరికల కుత్తుకల్ని కత్తిరిస్తూ, నీ గెలుపుగమ్యాలను వెతల శూలాలు తూట్లు పొడుస్తున్నాయా? అవకాశలు ఎండమావులై ఆశలను రేకెత్తిస్తున్నాయా? నిరాశానిస్పృహల వ్యాఘ్రం నీ ఆశయ దేహాన్ని కబళిస్తోందా? నవ్వుతోంది నీ అంతరాత్మ నిన్ను చూసి. కష్టాల కడలిలో, శిథిలమైన నావలో…

మన ఊరు మన బడి

మన ఊరు మన బస్తి బడి సకల వసతులు మెరుగుపడి అయ్యింది చదువులమ్మ ఒడి పిల్లలను జ్ఞానులుగా మలచే మడి ప్రభుత్వ బడిలో మొదటి అడుగు బావి జీవితానికి పడుతుంది గొడుగు తెలంగాణ ప్రభుత్వ బడులు బావి భవితకు బంగారు సోపానాలు పేద విద్యార్థులకు వరాలు మన ఊరు మనబడి కార్యక్రమాలు రేపటి పౌరులను తయారు…

విషాదాంతం

కనీసం ఒక దుఃఖాన్నైనా వెనకేసుకోవల్సింది బతుకు మడతల్లో ఎక్కడో ఉండిపోయాయో సంధ్యవేలో పొద్దుగాలో దులిపేప్పుడు పడిపోయాయో నిఖార్సైన విషాదం ఎట్టాంటిదో ఇంకా చూడలే ఎదపై హతాశపు దరువు ఇంకా మోగలే లోతులను కదిలించాలె పెకలించాలె ఇంత కర్కశమా జీవితం అన్నది అడ్డురాలే ఇంకా లోపల మొలకెత్తని బుద్ధుడున్నాడు కాలం శవమై రోగిష్టై ముసలిదై కానరాలే మహాభినిష్క్రమణలు…

పూల బతుకులు

నీ బతుకు,నా బతుకు, మనందరి బతుకు ఈ పూల బతుకు తీరే చెల్లీ…. మనకు, పూలకు పుట్టడం,పూయడమే వేరు వేరు కానీ పూల జీవితం,మన జీవితం ఒక్కతీరే శవాలపై బలవంతంగా ఉంచబడుతున్న పూలు శవాల ముందు చిటికేస్తూ విధిలేక ఆడుతున్న మన బతుకులు గౌరవానికి పూలది,మనది ఒకటే అవసరానికే పూలైనా,మనమైనా అక్కర తీరిందా… ఇద్దరి బతుకు…