Category సాహిత్యం-శోభ

Meta writing మరియు ఇద్దరి స్త్రీ అస్తిత్వవాదాలలో భిన్నత

‘Mother Mary Comes To Me’ పుస్తకం కవర్ లోపలివైపు ‘Memoir’ అని రాసి ఉంది. పుస్తకాన్ని లాంచ్ చేసినప్పుడూ, ఆ తర్వాత దాని గురించిన ఇంటర్వ్యూలలో ‘‘మా అమ్మ, ఆమెతో నా బంధము ఇందులోని విషయాలు‘‘ అని చెప్పింది రచయిత్రి. నిజమే, ప్రధానంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం (అదే ఆమె జీవితం కూడా) గురించి…

చెఱ!.. అతను జైల్లోకి వచ్చిపడ్డాడు

మెరుపు తీగెలు  జైల్లోకి రావడానికి ముందు కోర్టులో బోనెక్కాడు. అతను చెయ్యని నేరాలకు పోలీసులు ఆధారాలు చూపిస్తుంటే, చేసిన నేరాలు గుర్తుకు వచ్చాయి. కోర్టు సమయాన్ని లాయర్లూ జడ్జీలకన్నా యెవ్వరూ దుర్వినియోగం చేయలేరని కేసు మళ్ళీ వాయిదా పడ్డప్పుడు అనుకున్నాడు. శిక్ష తేలకుండా అతను అంత ఆనందంగా యెందుకు వున్నాడో జైలు సిబ్బందికి అర్థం కాలేదు.…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 5

(గత సంచిక తరువాయి) మెహర్లు, మాంగ్ లుఊరి బయట ఉంటూ, ఊరిని కాపలా కాయటం, ఊరిని శుభ్రం చేయటం, చనిపోయిన జంతువుల్ని తీసివేయటం, వాటి చర్మాలతో చెప్పులు కుట్టడం, తాళ్ళు పేనడం, బుట్టలల్లడం, పొలాలకు నీరు పారించడం, ఉన్నత జాతుల దయా దాక్షిణ్యాల మీద మనుగడ సాగించడం, ఇతర కులాల వారికి ఉండే సౌకర్యాలేవీ వీరికి…

నువ్వూ నేనూ నీడా!

ఎండ, తుపాకీ లేకుండా పేల్చేస్తోంది. వాడు అడుపు వీడు తుడుపు అని కాకుండా అందరికీ సమంగా వడ్డించేస్తోంది.   ఆ దారిన వొకే వొక పెద్ద చెట్టుంది. చెమటలు కక్కుతూ తనదగ్గరకు వచ్చినవాళ్ళకు గొడుగై నీడనిస్తోంది. అయితే ఆ గొడుగు కింద నీడ అందరికీ చాలడం లేదు.   నీడలో వున్నవాళ్ళు యెండనపడి వచ్చినవాళ్ళకి ‘నువ్వు…

వెంటాడే ఇంటి దిగులు

మేం అమెరికా చేరుకొని దాదాపు పాతికేళ్లు కావస్తోంది. ఇప్పటికీ పుట్టినగడ్డకి దూరంగా వున్నామన్న భావన బలంగానే వుంది. సామాజిక మాధ్యమాలు ఎంత ‘దగ్గిర’గా వున్నా, ఈ దూరాన్ని మాత్రం అవి చెరిపేయలేవని రోజురోజుకీ బలపడుతోంది. ముఖ్యంగా భాష అనే ముడిసరుకుతో పనిచేసే రచయితలకూ, పరిశోధకులకూ, అధ్యాపకులకూ ఇది రోజువారీ వేదన. అమెరికన్ జీవనశైలి ఎప్పటికైనా  అలవాటవుతుందని…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 4

‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’లో ఉర్దూ రచయిత్రుల నేపథ్యం, జీవితం, సాహిత్యం కనిపిస్తుంది. ముస్లిం స్త్రీల మనో భావాల్ని తమ కలం ద్వారా ప్రతిపాదించిన విధానాన్ని దేవరాజు చాలా సున్నితంగా ప్రస్తావించారు. ‘కలలో సుల్తానా’ అనే రచన రోకియా హుస్సేన్, ఉర్దూ పత్రికల ద్వారా సుఘ్ర హుమాయూన్ బేగం, ‘పర్దా’ అనే రచన ద్వారా నజర్…

ఈమె చేసేది ప్రేత ద్రోహమా?

అరుంధతీ రాయ్ రెండవ నవల ‘Mother Mary Comes to Me’ వారం క్రితం చాలా నిరాడంబరంగా కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితుల సమక్షంలో జరిగిందిట. మొదటి నవల, ‘The God of Small things’ వచ్చిన ముప్ఫై సంవత్సరాల తర్వాత. మొదటి నవలకు గొప్పపేరు, అదే మోతాదులో అప్రతిష్ట రెండూ ఆమెను సెలబ్రిటీని చేసాయి. మహరాష్ట్రలో,…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు-3

అయిదు వారాల ధారావాహిక (గత సంచిక తరువాయి) మరాఠీ రచయిత్రి తారాబాయి షిండే 1882 లో రచించిన ఃస్త్రీ పురుషతులనః అనే సుదీర్ఘవ్యాసాన్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఈమెను భారతదేశపు తొలి ఫెమినిస్ట్ అని పేర్కొన్నారు. జ్యోతిరావు ఫూలే కూడా తారాబాయి షిండే రచనలను, ఆమె భాషలో గల స్త్రీవాద పద జాలాన్ని, ఆమె…

ఇల్లు

ఎన్ని వర్షాలకు తడిసినా బొట్టు చుక్కకు జాగా లేదు ఆ తోడులో ఎన్ని ఎండలకు ఆ కప్పు మండినా ఒక్క పగులుకి ఆస్కారం లేదు ఆ నీడలో ఎన్ని కష్టాలకు పుట్టిల్లు మారినా ఆ ప్రేమకు ఢోకా లేదు ఆ గూడులో ఎన్ని బాధల మధ్య బంధాలు అల్లుకున్నా అసలు ఇరుకులేదు ఆ గుండెలో అమ్మ…