మెలకువ

ఎడారి కాగితం మీద పలు ప్రణాళికలుగా విస్తరించాను సూది రాతిమొనతో చీకటిరాత్రుల కళ్ళుపొడిచాను నాలుక తిప్పి భాషని లొంగదీసి వేల అబద్దాల్ని పోగుచేశాను ఎద్దుమెడలో కుండ పెంకునికట్టి వాణిజ్యప్రకటనని తయారు చేసుకున్నాను కాలికి చక్రం తొడిగి తెగ తిరిగాను గాలిని తెరచాపకి ముడివేసి సముద్రం మీదకి ఉసిగొలిపాను నీటిమీద కనబడని హద్దుల్ని గీశాను పేరులేని దేవుళ్ల…








