ఓకటైనకొకటి
మనిషెప్పటికి మారనితనాన్ని ముసుగేసుకుని మొండితనాన్ని మెడలేసుకుని మొరటుతనాన్ని వీడక మోడువారుతున్న వృక్షమై కూలుతున్న బతుకుతో ఊతంకోసమెదురుచూసే బేలచూపులతో బిచ్చగాడౌతున్నడు ఎంత కష్టంజేసిన బతుకుబండక్కడే కూలవడ్డది ఈతిబాధలెన్నైనా ఈదుతునేవున్నా దేహన్నంతా నలుగొట్టుకున్నా దాహంతీరక తీరంచేరక గొంగడక్కడే పాతుకుపోయింది అప్పులకుప్పలు కాళ్ళకు సంకెళ్ళైనయ్ ఎంతదూరంబోయిన ఎంటాడతనె వుంటయ్ గుండెల దిగులైతే తోయనితనాన్నంటించి నిద్రనంతా ఆమడదూరం విసేరేసింది పాడుబతుకుంతా ఆగమాగమయితుంటే…
