Category కవితా శాల

పువ్వుల పండుగ

ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ తీరొక్క పువ్వులతో రోజొక్క అలంకారముతో ముస్తాబై ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచులందరూ ఘనంగా జరుపుకునే రాష్ట్ర పండుగ బతుకమ్మ అమ్మ, అక్కలందరూ కలిసి వాడ వాడనా బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ సంబురాలు రాష్ట్ర సర్కార్‌ ‌బతుకమ్మ చీర…

ఉదయించే సూర్యుడు

పుట్టుకతో దళితుడైనా మానవీయ విలువలను ఆవిష్కరించిన కవిదిగ్గజం కుల వ్యవస్థపై తిరగబడ్డ నవయుగ కవి చక్రవర్తి దారిద్య్రం పై పోరాడిన విశ్వకవి సామ్రాట్‌ ‌స్వార్థం పై సమరం చేసిన కవి విశారదుడు మతసామరస్యాన్ని పెంచిన మధుర శ్రీనాధుడు అస్ఫృశ్యత పై గళమెత్తిన సాహితీ కవి కోకిల ‘వడ గాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం…

జయహో..తెలంగాణ బాపూజీ

మహోద్యమాల సారధి మూడు తరాల వారధి బడుగు జనుల పెన్నిధి తెలంగాణం జాతిపిత కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ బానిస విముక్తి కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన విప్లవకారుడు నిజాం నిరంకుశ పాలనపై నిప్పులు చిమ్మిన యోధుడు బూర్జువా వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు ముల్కీ ఉద్యమంలో … స్వతంత్ర సమరంలో ……

వెన్నెల దీపం

కాలం పరిహసిస్తుంది నీ వసంత వనం తుంచి నాకు శిశిరం కట్టబెట్టానని విధి విర్రవీగుతుంది నీ స్వర తంత్రుల తెంచి నిశీధి నిశబ్దం పరిచానని చితి జ్వాల వెక్కిరిస్తుంది నీ అణువణువు దహించి భస్మ ధూమం మిగిల్చానని మృత్యువు నవ్వుతుంది నిష్కర్షగా నిను కబళించి ఒంటరిగా నిలబెట్టామని పాడు లోకం గర్విస్తుంది పవిత్ర ప్రేమనుబందాన్ని సజీవ…

పిల్లల పండుగ… బొడ్డెమ్మ ప్రాధాన్యత

సృష్టిలో ప్రతీ జీవిది బ్రతుకు పోరాటమే, బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉండి, ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ బతుకమ్మ. ప్రత్యేకించి తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండగల కెల్లా పెద్ద పండుగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసి వారి హృదయాన్ని ఆవిష్కరింప జేసే పండుగ. బతుకమ్మ పండుగ గురించి అందరికీ…

ఓ ‌నీలి అంబరమా!

అంబరమా ఓ నీలి అంబరమా అవనికి నీవు అందమా అందకుండా వుంటేనే అందము! అందకుండా వుండేది గగనము! మిళ మిళ మెరిసే ఆ చుక్కలు రెక్కలు కట్టుక రమ్మంటాయి చిరునవ్వులు చిందే ఆ తారలు నీ ముంగిట్లో రంగవల్లులు! నీలి నీలి ఆ నింగి అవని వైపు వంగి అందినట్లే ఉంటుంది అంతలోనే ఎందుకో అందకుండా…

శివరంజని రాగమా..

స్వేచ్చా కపోతమా స్వచ్ఛమైన శ్వేత సౌధమా ఎగిరొచ్చి నా హృదిలో వాలిన నేస్తమా వసంత ఆగమ నాన నా తోటలో విరిసిన పుష్పమా ఆశల పల్లకిలో అందమైన అబద్దమా ఆకాశమంత నా మదిలో అంతులేని ఆనందమా లిప్ల కాలంలో మాయమైన ప్రియతమా కనుల కొలనులలో నిశ్శబ్ద కన్నీటి ప్రవాహమా నా స్వప్నలోకాన్నుంచి నిష్క్రమించి నన్నే కాకిని…

జయహో.. తెలంగాణా

భూమి కోసం… భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం మట్టి మనుషులు సమైక్యమై ఉద్యమించిన పోరుగడ్డ ఇది అణిచివేత వెట్టిచాకిరిలను వ్యతిరేకిస్తూ సకలజనావలి సాయుధ పోరెత్తిన రణ క్షేత్రం ఊరూవాడలు కదం తొక్కి నిజాం నవాబుకు నిలువున సమాధి కట్టిన సమరాంగణం సామాన్యులు సమర సింహాలై రజాకార్లు దొరల గూండాలను తరిమికొట్టిన పరాక్రమ నెలవు బండెనక…

ఓ ‌వర్షం కురిసిన రాత్రి!

తుషారాల తునుకులు తళుకుమంటూ మెరుస్తూ! అంబరం నుండి అమ్బుదిలోకి జారుడు బల్లలు ఆడుతూ! మబ్బుల గోడల మధ్య చిన్నటి కైపులు పోతూ గవాక్షాన్ని తెరచిన వెన్నల రేడు! చిత్రంగా సైగలు రువ్వుతూ! చిక్కటి చీకటి నభములో వెండి తీగలు జిగేలుమంటూ! వెలుగు గీతలు చేసి సన్నటి తుంపరకు తోవచూపుతూ! పచ్చటి సన్నజాజి పందిరి గుబాళింపు తాలింపు…