Category కవితా శాల

ఆకాశంలో సంబరం

ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి  వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…

నవోదయం

జీవితం వొక శిల అయిపోయిందని వొరిగిపోకు ఇప్పుడే ఆశల వులుల కలకలం మొదలైంది అది శిల్ప పరిమళాలతో వికసించడానికి… సంకల్పం వొక బిందువే అని క్రుంగిపోకు ఇప్పుడే ఆలోచనల జలాల ప్రవాహం ప్రారంభమైంది అది సింధువై ఆశయాల అలలతో వుప్పొంగడానికి… నేస్తం! సమైక్యతాసూర్యుడు సరికొత్త సామాజిక కిరణాలతో జగతిని జాగృతం చేయడానికి అలుముకున్న అలజడుల తిమిరాలు…

కిరీటం లేని రాజులా…

భిక్ష మెత్తుకునే అమ్మ భుజంపై గాఢనిద్రలో వీధులన్నీ ఊరేగే కిరీటం లేని రాజులా ఇష్టాలని పాలిస్తున్నాడు రెండు చేతులు కరచుకున్న కౌగిలిలో కురిసే కేరింతలే పేదరికంలో దుమికే జలపాతాలు నేలపై కాలు పెట్టకుండా ఒడి దాటకుండా చంక దిగకుండా వీపు మీదగా వాడి ఎగుడు దిగుడు చూపులు ఈ లోకానికి  చిక్కు ప్రశ్నలే…. – శ్రీ…

కాంతి సముద్రం

ఈ నాలుగ్గోడలే ఇలా మార్చాయి స్పష్టత సున్నంలా రాలిపోయింది అవగాహన పెచ్చులూడిపోయింది నలుగురు అరిస్తే నాలుక తడబడింది చదువు వివేకం కొయ్యబారిపోయాయి విజ్ఞత సిగ్గుతో మొహమాటంతో ఊగిసలాడుతూ ఏమీ అనలేకపోయింది మొహం ఓడిపోయినట్టు నీరుగారింది దేహం కుంచించుకుపోయింది గొంతు పడిపోయింది వణుకుతూ అగాధంలో ఊపిరికి గాలి అందట్లేదు కళ్ళు లోపలికి చూస్తూ కన్నీళ్ళను మింగుతున్నాయి బద్దలుగొట్టాలి…

మునుగోడు ముఖచిత్రం

కోళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి రెక్కలొచ్చి కోళ్ల ధరలు అందకున్నాయి నాటు కోళ్ల మాట చెప్పవీలు లేదు వీధి వీధికొక కొత్త హోటళ్ళు రాత్రికి రాత్రే మొలిచి వెలుగుతున్నాయి వారుణీ వాహిని వరదలై పారుతోంది ఇన్నాళ్లూ టీవీ లలో దర్శనమిచ్చే రంగుల కండువాల రాజకీయ మేస్త్రీలు ఇంటింటికీ గడప గడపకూ ఓట్ల బిక్షకై కదలి వస్తున్నారు లేనివరుసలు…

అజ్ఞాన తిమిరాలు!..

పట్టాలు సమాంతరంగా ఉంటేనే గమ్యం ఎంత దూరమైనా రైలు గమనం సాగుతుంది గమ్యం చేరువవుతుంది పక్షి చిన్నదైనా పెద్దదైనా సమన్వయంతో రెక్కలార్చితేనే స్వేచ్ఛగా గాలిలో ఎక్కడికైనా ఎగురుతుంది కాళ్లు రెండైనా నాలుగైన అడుగు వెనక అడుగు వేస్తేనే ముళ్ళ బాటైనా పూల బాటై ముందుకు సాగుతుంది నేత్రమైన మనోనేత్రమైన ఇలలోనైనా కలలోనైనా గోచరించే దృశ్యాలెన్నైనా నిలుపుకున్నదృశ్యన్నే…

నిరంతర కార్తీక దీపం

స్వార్ధమనే తామస భావంతో కఠినత్వం కారు చీకటిలా కమ్మిన ఇలలో సంకుచిత తత్వాన్ని ధరించిన సమాజ సమూహాలలో… హృదయసంద్రాలలో ఆర్ద్రతా వత్తులు పేనుకొని, అనుబంధాల దీప్తులు ప్రజ్వలింపచేసి, మనోవాంచితాల చైతన్య కాగడాలు ముట్టిస్తూ, ఆప్యాయతా వెలుగుల్ని పోగేసుకుంటూ, మనిషే ఒక మానవత్వ దీపమై గోరంత దీపాన్ని వెలిగిస్తే అది కొండంత వెలుగునివ్వదా? అజ్ఞాన తిమిరాన్ని బాపే…

బంగారు, వెండి గొడ్డలికి ఆశ పడకు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజా రథాన్ని నడిపించే తంత్రాలు! సారధులను ఎంచుకునే వరాలు! పలు ఎన్నికలు ఉప ఎన్నికలు ప్రజా పరిణతికి పరీక్ష! ప్రజాస్వామ్య పరిరక్షణకు శ్రీ రామ రక్ష! తంత్రమంటే పగలు ప్రతీకారాలకు వేదిక కారాదు! ప్రజా తంత్రం ప్రజల ఆశలు నెరవేర్చే మంత్రం కావాలి! ఎన్నికలు అంటే… కష్టాల కట్టెలు కొట్టుకొని బ్రతికే ప్రజల…

నేర్చుకుందాం రా రండి!

పిల్లలూ రండి రా రండి ఆంగ్ల నెలలు నేర్చుకుందాం రా రండి గుర్తులతో నేర్చుకుందాం రా రండి మొదటి నెల జనవరి నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సంక్రాంతి సెలవులు ఆరంభం రిపబ్లిక్‌ ‌డే వేడుకలు కూడా ఈనెలే రెండవది ఫిబ్రవరి సంవత్సర మొత్తంలో చిన్నది తక్కువ రోజుల నెలండి మూడవ నెల మార్చి పరీక్షలు…