ఏ వెలుగులకీ ప్రస్థానం…
విను నాలోని ధ్వనులను కొండ చర్యలు కూలుతున్నవి లోపలి గదులు పొరలు కంపిస్తున్నవి భీకర తుఫాను గాలులు ముంచెత్తుతున్నవి లావా పొంగుతుంది వేడి సెగలు జ్వాలలు గుబురుగా పొగలు నాలో కిటికీలన్నీ తెరిచినప్పటినుంచే ఒక్కొక్కటిగా ప్రవేశించాయి లోనికి పేరుకుని మరిగి మరిగి నిండి విస్పోటనం గాంచుతున్నాయి వింటున్నావా…? బతుకులు ప్రశ్నార్ధకమైన కాలాల నుండి అస్తిత్వాన్ని అందలమెక్కించే…



