Category శీర్షికలు

దానవత్వాన్ని దహిద్ధాం !

మనిషితనాన్ని రాయి చేసుకున్నడు రాయిని దేవునిగా పూజిస్తున్నడు రాక్షసత్వాన్ని లోన నింపుకున్నడు నెపం రాతిపై నెడుతున్నడు! అంతరంగంలో శూన్యం ఏర్పడితే దానవత్వం దండయాత్ర చేస్తుంది ఎలా బతకాలో తెలిసేలోపు ఈర్ష్యాసూయ ద్వేషాలు గాండ్రిస్తున్నవి మానవత్వం ఆపద బోనులో దోషిగా నిలుచుంటుంది! మనిషిలోని దానవ త్వాన్ని దహిద్దాం మానవత్వాన్ని మనిషిలో మేల్కొల్పుదాం మానవత్వాన్ని వారసత్వంగా పంచుదాం మనిషి…

ఇక టిఆర్‌ఎస్‌ ‌తెరమరుగేనా ?

దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టిఆర్‌ఎస్‌) ‌త్వరలో కనుమరుగు కానుందా అన్న విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నేటికి ఇరవై ఒక్క సంవత్సరాల కింద కేవలం ఉద్యమపార్టీగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం రాజకీయ పార్టీగా మారిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రాంతీయ పరిధిని వీడి దేశ రాజకీయాలవైపు…

‌త్రిపుల్‌ ఐటి సమస్యలు తీర్చాలి

‘‘ఉల్టా చోర్‌ ‌కోత్వాల్‌ ‌కో డాంటే!’’ మన తెలంగాణ లో వాడుకలో వున్న ఒక మంచి సామెత ఇప్పుడు బాసర ఐటి లో నిజమై కనిపిస్తున్నది.ఎండా వానలకు ఎదురేగి ఉద్యమించిన వేలాది మంది విద్యార్థులు చేస్తున డిమాండ్లను పక్కన నెట్టి,కొత్తగా ఓ అధికారిని నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వ చర్య తెలంగాణ సమాజానికి ‘‘సిల్లీ’’గా కనిపిస్తూంది.…

కాటికి చేరిన ప్రాయం!

వయసు ఉన్నప్పుడు ప్రణయం రాదు! ప్రణయం వచ్చే వరకు పరువం ఆగదు! హేమంతంతో సంగమం శిశిరంలో సాగితే! వసంతంతో సమాగమం ఉక్కపోతలో జోగితే! సోయలన్నీ జారిపోతూ సొబగులన్నీ జోలిపోతూ! వలపులకు, తలపులకు వియోగాలే మిగిలినవేళ! చెరుపులకు, మరుపులకు సంయోగాలే కలిగినవేళ! సింగారాలకు సిగపట్లు చాలక వయ్యారాలకు అగచాట్లు లేక! ఊహలు పుట్టని ఊసుల్లో కలలు రాని…

 ‌డోజర్ల దౌడులు

రాగద్వేషాల నాటకాలు.. భయ పక్షపాతాలకే.. పట్టం కట్టే కీచక పర్వాలు విభజించి పాలిస్తూ.. లక్షిత సమూహాలపై.. బుల్డోజర్లు దౌడుతీతలు ఉత్తర భారతాన కూల్చు వేతలు ! బుల్డోజర్‌ ఒక యంత్రమే కాదు.. భవనాల తలల్ని నరికే ఆయుధం విద్వేష విచ్ఛిన్న విధ్వంస చిహ్నం సామాన్యడి ఇంటిపై ఉక్కుపాదం నాగరికతను చూర్ణం చేసే డోజర్‌ ‌రాజ్యాంగ విలువలకు…

మెరుపు గింజలు

అక్కడ కొన్ని దేహాలు మాట్లాడతాయి కొమ్మలకు ఇప్పటికీ వేళాడబడి వుంటాయి అల్లంత దూరంలో గొంతులను పేర్చబడి చోద్యం చుస్తూ వున్న కొన్ని రాబందులు కుప్పల తెప్పల సంజాయిషీలు పడి వుంటాయి సైగలు చేసే చేతులు కాలే కడుపులు ఎండిన డొక్కలు దీనంగా చూస్తుంటాయి ఆ చూపుల తడిలో ఇప్పటికీ వెచ్చగా కొన్ని గింజలు మొలకెత్తుతుంటాయి చేసిన…

సారవంతమైన నేలల్ని ఎడారులుగా మార్చవద్దు..!

నేడు ‘ప్రపంచ ఎడారీకరణ, కరువు వ్యతిరేక దినం’ 1960ల్లో నార్మన్‌ ‌బోర్లాగ్‌ ‌నాయకత్వంలో వచ్చిన హరిత విప్లవంతో వరి, గోధుమ లాంటి పొట్టి పంటలను ఏళ్ల తరబడి సాగుచేయడంతో నేలలు నిస్సారమై ఎడారీకరణకు బీజాలు పడ్డాయి. సహజ విపత్తులు లేదా మానవ కృత్రిమ కార్యాల వల్ల సారవంతమైన నేల నిర్వీర్యం, నిస్సారం కావడాన్ని ఎడారీకరణగా పేర్కొంటారు.…

కోనసీమలో పంట విరామ పోరు

గత దశాబ్దాలుగా పుడమి తల్లినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతుల వ్యధలు అన్నీ ఇన్నీ కావు.పది కాలాలపాటు నిలిచి పదిమంది ప్రాణాలను కాపాడే అన్నదాత రైతు. రైతుకు కష్టం వస్తే భరిస్తాడు తప్ప గొంతెత్తడు అనే నమ్మకం నాయక గణానికి వచ్చేసింది. ఎందుకంటే రైతులు సంఘటితం కాలేరు అనే నమ్మకం.నిజమే రైతులే సంఘటిత పోరాటాలు నడిపి…

మెప్పించి ఒప్పించాల్సిన చోట…

సామ దానంమాని కేవలం దండోపాయంతోనే ప్రజలను నిరోధిస్తామన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ప్రజల సౌకర్యంకోసం, ప్రజల మద్దతుతో చేపడుతున్న పనులకు సంబంధించి , ఆ ప్రజలు నష్టపడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో జాప్యంచేస్తుండాన్ని ప్రశ్నించినందుకు వారిని చితక బాదడమన్నది నిజంగా బాధాకరం . తమ ప్రాంతంకోసం, తమ ఊరికోసం చేపడుతున్న ప్రాజెక్టుల్లో తమ…