Category శీర్షికలు

చేనేతకు చేయూత – తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు బాసట

‘‘‌చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాలకు వారి మరణాంతరము ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం నేతన్న బీమా పథకము ప్రారంభించింది. రైతు బీమా తరహాలో ఈ పథకము కూడా జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.‌సి.) ద్వారా అమలు చేయటం జరుగుతుంది. జీవిత బీమా సంస్థకు లబ్దిదారుల సంవత్సరం ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది’’. రైతు…

15 ఏళ్ళ ఎన్టీవీ పాత్రికేయ ప్రయాణం …

న్యూస్‌ ‌ఛానల్‌ అం‌టే టీఆర్పీ రేటింగ్‌ ‌ల కోసం వెంపర్లాట కాదు…ఒక సామాజిక బాధ్యత అని గట్టిగా నమ్మిన వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి. జర్నలిజం అంటే ప్రజా గళాన్ని వినిపించటం. వార్త అంటే వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం. అందుకే సరిగ్గా 15 ఏళ్ల కిందట నరేంద్ర చౌదరి ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకుంది…

తోవ దప్పని ‘‘తోక పతంగులు’’

‘‘‌బతికెటందుకు దినాం సావుకెదురు బొయి అడుగడుగున పోరు జెండెత్తిన త్యాగాలశెరిత మనది.గసొంటి మట్టిల పుట్టినోళ్ళు యేండ్లకేండ్లు బందూకు బట్టని దినవంటున్నదా! జనం దండు గట్టని పల్లెలున్నయా!? గీ మట్టిల మొలిషిన శెట్లకన్న మర్లవడ్డ తుపాకులే ఎక్కువుంటయి. కన్నపేమను కడుపుల దాసుకొని ఇంటికో కన్నపేగును పోరుదారిన తోలిన అవ్వలెందరో గువ్వలోలిగె రాలి పోయిన కన్నబిడ్డ కోసం కంట…

కెసిఆర్‌ అం‌తిమ ఫర్మానా ..!

భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్‌ ‌సర్కార్‌ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా, లైబ్రరీలు, పాఠశాలలు నిర్వహణపై అంకుశం మోపుతూ ఇలాగే ఫర్మానా జారీ చేస్తే,…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

“ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం ఆ ఉద్యోగికి కల్పించబడుతుందని, ఆ ఉద్యోగి తన మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా, తనకు…

పరిభ్రమణం

ఉన్నది ఉన్నట్లు చెప్పటం ఉన్నది ఉన్నట్లు రాయటం ఇప్పుడు గతం ఏది ఉందని చెప్పాలి? ఏది లేదని దాయాలి? లేనిదేదో ఉందని భ్రమింప జేసుకున్న తర్వాత భ్రమ చుట్టూ ప్రపంచం పరిభ్రమించటం మొదలు పెట్టాక ఉందని అనుకోవటంలోనే ఆనందం ఆరాధనే తాదాత్మ్యం భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేస్తారా?? భ్రమే వాస్తవమని ప్రపంచం సూత్రీకరించాక భ్రమింపబడటమే ఓ…

వయోధిక పాత్రికేయుడు కూచి గోపాలకృష్ణకు నివాళి

సహృదయుడు, స్నేహశీలి, చతుర సంభాషణ ప్రియుడు, పాత్రికేయుల్లో పాతతరంవాడు, చిరునవ్వుల వదనం.. అయనే కూచి గోపాలకృష్ణ. ఎనభై అయిదేళ్లు ఆడుతూ పాడుతూ కలంకార్మికునిగా జీవితం గడిపి సరిగ్గా గత ఏడాది ఆగస్ట్ 27‌వ తేదీ స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌ ‌లో కన్నుమూసిన మిత్రునికి నివాళి. హైదరాబాద్‌ ‌మిత్రులకంటె విజయవాడ కేంద్రంలో సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా…

బహుజన తాత్వికుడు

శూద్రజాతీయ వాద ‘‘భూమిక’’ను తన రచనల ద్వార ప్రతిపాదించిన.. ‘‘ఈ ‌దేశానికి వలస వచ్చిన 9 ఆర్యతెగలు ఎలా బ్రాహ్మణులుగా మారారో, అనంతరం వారు ఆహ్వానిస్తే వచ్చిన మిగతా ఆర్య, సెమిటిక్‌ ‌తెగలు ఇక్కడ మిగతా రెండు అగ్రవర్ణాలుగా మారారో, వారి ఆధిపత్యం కోసం ఈ దేశ మూలవాసులను ఎలా శూద్రులుగా మార్చారో, ఆ క్రమంలో…

శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్న ఒక…