Category శీర్షికలు

జిస్‌కా లాఠీ ఉస్‌కీ బయింస్‌

దుడ్డు ఎవరిదో బర్రె వాడిదన్న నానుడిలా ఉంది ఏపి ప్రభుత్వ వైఖరి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆమోదంతో పని లేకుండా తమకు ఇష్టంవచ్చిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఏపి ప్రభుత్వం ఇప్పుడు చెప్పకనే చెప్పింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడెవరైనా దివంగతులైతే వారి జ్ఞాపకార్థం కొత్త నిర్మాణాలకు, సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు లేదా రహదారులకు వారి పేర్లను…

పిల్లల పండుగ… బొడ్డెమ్మ ప్రాధాన్యత

సృష్టిలో ప్రతీ జీవిది బ్రతుకు పోరాటమే, బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉండి, ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ బతుకమ్మ. ప్రత్యేకించి తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండగల కెల్లా పెద్ద పండుగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసి వారి హృదయాన్ని ఆవిష్కరింప జేసే పండుగ. బతుకమ్మ పండుగ గురించి అందరికీ…

అసాధారణ ప్రయత్నం…

తెలుగు సాహిత్యంలో ప్రామాణికతను పొందుగుకుని విశేషాదరాభిమానాలను పొందింది శతకం. అనుభవైక సంవేదననూ, ఒక అభిరుచినీ, ఒక విమర్శాదృష్టిని  కలిగించడంలో శతకానికి ప్రాధాన్యత ఉంది. ముఖం వ్యాకరణం స్మృతమ్‌…. ‌వేదానికి వ్యాకరణం ముఖప్రాయమని వైయాకరణులు భావించారు. శతకానికి ఛందస్సు ప్రధానమైనప్పటికీ సరళమైన పదజాలంతో పండిత పామర ప్రీతిపాత్రంగా సాగిన శతకాలు తెలుగులో ఎన్నో లభిస్తాయి. మారిన కాలానికి…

ఓ ‌నీలి అంబరమా!

అంబరమా ఓ నీలి అంబరమా అవనికి నీవు అందమా అందకుండా వుంటేనే అందము! అందకుండా వుండేది గగనము! మిళ మిళ మెరిసే ఆ చుక్కలు రెక్కలు కట్టుక రమ్మంటాయి చిరునవ్వులు చిందే ఆ తారలు నీ ముంగిట్లో రంగవల్లులు! నీలి నీలి ఆ నింగి అవని వైపు వంగి అందినట్లే ఉంటుంది అంతలోనే ఎందుకో అందకుండా…

శివరంజని రాగమా..

స్వేచ్చా కపోతమా స్వచ్ఛమైన శ్వేత సౌధమా ఎగిరొచ్చి నా హృదిలో వాలిన నేస్తమా వసంత ఆగమ నాన నా తోటలో విరిసిన పుష్పమా ఆశల పల్లకిలో అందమైన అబద్దమా ఆకాశమంత నా మదిలో అంతులేని ఆనందమా లిప్ల కాలంలో మాయమైన ప్రియతమా కనుల కొలనులలో నిశ్శబ్ద కన్నీటి ప్రవాహమా నా స్వప్నలోకాన్నుంచి నిష్క్రమించి నన్నే కాకిని…

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిద్దామా, విమర్శిద్దామా..?

‘‘ఏమైనా ప్రపంచ ఇర్రిగేషన్‌ ‌ప్రాజెక్టుల చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ‘ఇంజనీరింగ్‌ ‌మార్వెల్‌’ అని కొనియాడబడుతుంది. ఇలాంటి భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో శాస్త్ర సాంకేతిక నిపుణుల లోతైన సలహాలను తీసుకుంటూ రాష్ట్ర ఖజానాపై అధిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలు, పాలకులు తీసుకొని ఉండాల్సింది.’’ కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు Kaleswaram Lift…

మరో ప్రపంచ యుద్ధాన్ని ఐరాస నివారించాలి

సెప్టెంబర్‌ 21… అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం United Nations ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 21 ‌తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1981లో సెప్టెంబర్‌ 21‌న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా…

కాంగెస్‌ ‌పార్టీకి పెద్ద సమస్యగా జాతీయ అధ్యక్ష ఎన్నిక

National Congress Party జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక పెద్ద సమస్యగా తయారయింది. ఈ పదవిని చేపట్టే విషయంలో రాహుల్‌ ‌గాంధీ సుముఖంగా లేకపోవడంతో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా అమె అస్వస్థతగా ఉండటం వల్ల అధ్యక్ష…

‘‘‌విలువలు, ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్‌’’

‌పదేళ్ళకే ఆయన్ను మరచిపోయారా? సెప్టెంబర్‌ 21 ‌పదవ వర్ధంతి. 27వ తేదీ 97వ జయంతి ఓట్ల రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలపక్షాన నిలబడి ఉద్యమాలు చేసిన ఉన్నతుడు. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం మొదలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు స్వీయ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజలతో కలిసి అడుగులేసిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా…