Category శీర్షికలు

2020 నుంచి నాతో మొదలైంది

సాహిత్యం చదవడం, రాయడంలోకి మిమ్మల్ని నడిపిన అంశాలు? చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో పడుకుని ఆకాశంలో చందమామని చుక్కల్ని చూస్తూ అమ్మమ్మో నాయనమ్మో నక్కబావ కొంగబావ అంటూ కథలు చెబుతుంటే, ఊఁ.. కొడుతూ వినే కాలం ఒకటి ఉండేది కదా ఆ కాలపు ఆఖరితరం వాడిగా కథలమీద ప్రేమ ఏర్పడి ఉండొచ్చు. అలాగ వినడంతో మొదలైన ఆసక్తే…

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం – 2

(2014-2023) (గత సంచిక తరువాయి భాగం) దిలావర్‌ రాసిన ‘రాళ్ళూరప్పలు’ (2014) కథ గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి పేరిట యాంత్రీకరణ వలన పనుల కోసం వెళ్ళిన కోయ స్త్రీలు మైదాన ప్రాంత వాసుల చేతిలో చిక్కి అత్యాచారాలకు గురవుతున్న వైనాన్ని చిత్రించింది. గిరిజనులు నివసించే మారుమూల కోయగూడెం ప్రాంతంలో అభివృద్ధి పేరున పెద్ద పెద్ద యంత్రాలతో…

నిశ్శబ్ద మాధుర్యం

భిన్నభావాల స్మృతిదర్పణమే మనోఫలకం. రోజుకో భావాన్ని పరిశోషించి, పరిశోధించి రంగరించుకుంటూ  చేసిన మిశ్రమం ఎన్నో శబ్దాలను గుండె లోతుల్లో లయలుగా నిక్షిప్తం చేస్తుంది. ఆ భావాలను పెదాలు పలకనీయవు. మదిలో అలజడిని బయటకు దొర్లనీయవు. వయసుతో పాటే నేర్చిన పాఠాలు ఈ మౌనంలో మారాం చేస్తుంటాయి. వాటికి బయటకు తరలింప జేసిన మార్గమే నా ఈ…

శరథీ!

దాశరధీ రాక్షస రాజ్య వ్యతిరేక శరపరంపర శరధీ రజాకార్ల ఇనుప బూట్ల ఘట్టనపై తూటాల రవళీ సమరమే నినాదమైన అద్భుత కావ్య ఖడ్గసృష్టీ జైలుగోడలపైనా నినదించిన తెలగాణ పౌరుష నాడీ నిరంతరం నిజాము ముసలి నక్కపై ప్రశ్నల కేళీ తిమిరంపై సమరంతో సమత్వ భావ పరివ్యాప్త ప్రచండ భేరి నిద్రాణ తెలగాణలో “రుద్రవీణ” మోగించి “అగ్నిధార”లు…

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం

ప్రపంచీకరణ నేపథ్యంలో అడవితల్లి బిడ్డలైన గిరిజనులు అనివార్యంగా మైదానప్రాంతవాసులతో సహవాసం చేయాల్సి వచ్చింది. పాశ్చాత్యసంస్కృతి ప్రభావం మారుమూల తండాలకు, గూడేలకు విస్తరించి, ఆదివాసుల జీవనసంస్కృతిని కలుషితం చేసింది. ప్రత్యేకమైన భాషాసంస్కృతులు, వేషధారణ, జీవనవిధానాన్ని నేటితరం కాపాడుకోలేకపోతున్నారు. తెలంగాణ జనాభాలో దాదాపు 10% వరకు గిరిజనులు బంజారాలు, కోయలు, గోండులు, చెంచులు, కొండరెడ్లు, కోలం, తోటి తెగలవారున్నారు.…

లవ్!

‘నిన్ను నువ్వు యెప్పుడైనా అద్దంలో చూసుకున్నావానే?’ ‘ఊ… నాకేం తక్కువ?’ ‘బంగారం బొమ్మలా వుంటావు కదనే?’ ‘యా…’ ‘మరి గా కోతిగాడికి యెట్ల పడినావే?’ ‘మన పూర్వీకులనంటే మంచిగుండదు!’ ‘చాల్లే, గా బద్మాష్‌గాడు నీకెట్ల నచ్చిండే?’ ‘బద్మాష్‌గాడు కాబట్టి…’ ‘నవ్వకు, గాడు నీకు నచ్చనీకి నాలుగు కారణాలు జెప్పే?’ ‘పైసలుండి కూడా లేనోళ్లని ఫీల్‌ గానీకుండా…

జాజులు నవ్విన రాత్రి

జాజులు నవ్విన ఏ జావళీల జానపదుల్లో నిన్ను వెతుక్కొంటూ వేణుగానమై రవళిస్తుంటాను పవళించే నీ ఊహల రాత్రుల్లో వెండి వెన్నెల రంగుల కలల్ని నెమరేస్తూ నెమ్మదిగా నన్ను నేను మైమరచిపోతాను జాగురూకతో జాబిలి రాత్రుల్ని నీకై అన్వేషణ సాగిస్తాను మంద్రంగా మీటే మిణుగురు రాగాల్ని వింటూ నీ కోసం సాహిత్య చకోరినై ఏ గగన తీరాన్నో…

దాశరథి ‘సమైక్య’ కవిత

తెలుగు కవిత్వానికి అంగారాన్ని, శృంగారాన్ని అద్దిన దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987) శతజయంతి సంవత్సరం ఇది. నూరువసంతాల కింద పుట్టిన దాశరథి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని(1946-1951) అగ్నికంఠంతో అక్షరీకరించాడు. బతికినంత కాలం తెలంగాణ కోసం ఒళ్ళంతా నోరుజేసుకొని కొట్లాడాడు. సినిమాలకు పాటలు రాసి రసహృదయుల మనస్సులను చూరగొన్నాడు. ‘నిప్పుపూలు’లాంటి తెలంగాణ ఆత్మను పట్టిచూపే కథలు కూడా…

తెలంగాణ సమరబోధి

‘మేకిట్‌ న్యూ’ అనే పిలుపునిచ్చాడు ఎజ్రాపౌండ్‌. ఈ  పిలుపు అనేకచోట్ల, అనేకవిధాలుగా సాహిత్యంలో ప్రతిఫలించింది ఆధునిక ఉద్యమమైంది. గతంతో తెగదెంపులు చేసుకుంది. పాత సాంప్రదాయలను వదిలి పెట్టమని ఉద్బోధించింది. కొత్తరూపాలను ఆవిష్కరించింది. కవులను, కళాకారులను నూతన పద్ధతులను, కొత్తపుంతలను అనుసరించేట్లు చేసింది. మహాకవి దాశరధి కూడా ‘పునర్నవం’ అని పిలుపునిచ్చాడు. తెలుగు కవులు ఏ మేరకు…