అసెంబ్లీ సమావేశాల్లో ఉగ్రవాదుల్లా ప్రతిపక్ష నాయకులు
ప్రజా ప్రభుత్వానికి మీ దీవెనలు కావాలి
విఠాయిపల్లిలో ’భూభారతి’ ప్రారంభించిన మంత్రి పొంగులేటి
ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించని ‘ధరణి’ని బంగాళాఖాతంలో పడేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని విటాయిపల్లి గ్రామంలో సమీకృత భూభారతి పోర్టల్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రూపొందించిన ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తు ప్రణాళిక ఆధారంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని{నీ ప్రణాళికాబద్ధంగా ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించి అమలు చేస్తున్నామని చెప్పారు. 5,270 గ్రామాలలో వీఆర్వోలను ఏర్పాటు చేశామని, అదేవిధంగా లైసెన్సుడ్ సర్వేయర్లకు ఆరు నెలలు శిక్షణ అందించి నియమించామని గుర్తు చేశారు. రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రూపొందించామన్నారు. ఈ పోర్టల్‌ను గురువారం నుంచి ఐదు మండలాల్లో ప్రయోగత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేస్తుTన్నట్లు వెల్లడించారు. వచ్చే ఫలితాలన”బట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేసి ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో మొదటగా ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, ఆయా జిల్లాల కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకులు ఉగ్రవాదులుగా వ్యవహరించారంటూ ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలు చేయడం భావ్యం కాదన్నారు. అసెంబ్లీలో జరిగిన సంఘటన వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ప్రవర్తించాలని మంత్రి సూచించారు. గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి నుంచే పొందేలా ఫొటోలు తయారు చేశామన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కుప్పగండ్ల చెదురువెల్లిలో భూ సమస్యల పరిష్కారాన్ని కృషిచేయాలన్నారు. అదేవిధంగా ఆమనగల్‌లో డంపింగ్ యార్డు తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యా, కౌన్సిలర్ అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ గీతా నరసింహ, టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, కండె సాయి, తహసిల్దార్ ఫహీం ఖాద్రి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





