బోధన్‌ ఎస్‌బిఐలో రూ.5లక్షలు చోరీ

– సిసి పుటేజీ ఆధారంగా బాలుడు చేసినట్లు గుర్తింపు

నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు13 : చిన్న పిల్లలను ఉపయోగించుకుని నేరాలు చేయించే వ్యక్తులను మనం సినిమాల్లో చూస్తుంటాం. చిన్న పిల్లలకు ఒక పని అప్పజెప్పి వెనకాల నుంచి గమనిస్తూ ఉంటారు కేటుగాళ్లు. ఆ బాలుడు నేరం చేసేటప్పుడు దొరికిపోయినా గమనిస్తున్న వాడు మాత్రం పరార్‌ అయిపోవచ్చు. ఒకవేళ బాలుడే పట్టుబడి మైనర్‌ అయితే.. జైలు శిక్షకు బదులు జ్యువైనల్‌ ‌హోమ్‌కి పంపిస్తారనే విషయం నిందితులకు బాగా తెలుసు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బోధన్‌ ‌లో వెలుగు చూసింది. నిజామాబాద్‌ ‌జిల్లా బోధన్‌ ‌భారతీయ స్టేట్‌ ‌బ్యాంకులో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన బ్యాంకులో రూ.5లక్షలు చోరీకి గురైనట్లు బ్యాంక్‌ అధికారి నాగనాథ్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ఓ 12 ఏళ్ల బాలుడు క్యాష్‌ ‌కౌంటర్‌ ‌వైపు వెళ్లి చోరీ చేసినట్లు గుర్తించారు. బాలుడు చోరీ చేసే సమయంలో మరో ఇద్దరు అతనికి సహకరించినట్లు- పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *