పబ్‌లో హంగామా
హైదరాబాద్, జూన్ 12: ప్రిజం పబ్‌లో నానా హంగామా చేసిన నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29వ తేదీ రాత్రి సమయంలో పబ్‌కి వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించింది. అర్ధరాత్రి సమయంలో పబ్బులో తనకు కాంప్లిమెంటరీ కావాలని హంగామా చేసింది. అంతేకాకుండా పబ్బులో ప్లేట్లు, గ్లాసులుతోపాటు ఫర్నిచర్‌ని కూడా ధ్వంసం చేసింది. ఈ క్రమంలో పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించింది. కోర్టు అనుమతితో పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది.


