తలసానిపై పోలీస్‌ ‌కేసు నమోదు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి నేత తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌పై ఎస్‌ఆర్‌నగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌నేత రవికిరణ్‌ ‌దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఆర్‌ ‌నగర్‌ ‌పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *