కిట్స్‌లో విజయవంతంగా ముగిసిన కార్నివాల్ ‘సంస్కృతి-2026‘

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 7: సాంస్కృతిక సాంప్రదాయ బీట్‌లు విద్యార్థుల జీవితంలో క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తాయని కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి అన్నారు. కిట్స్ క్యాంపస్‌లో మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండీఎఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్(సాక్), కిట్స్ డబ్ల్యు ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సాంస్కృతిక కార్నివాల్ ‘సంస్కృతి-26’ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. శనివారం రెండో రోజు సాంప్రదాయ బీట్స్ చలనచిత్ర గాయని ఇ.మనీషా ప్రోషో నిర్వహించారు. రెండు రోజులుగా తమ సంస్థలో విభిన్న సాంస్కృతిక, వినూత్న కార్యక్రమాలు జరిగాయని, ఇవి విద్యార్థుల మధ్య నైతికతను పెంపొందించడమేగాక వ్యక్తిగత, సమష్టి బాధ్యతను ప్రోత్సహించాయని అన్నారు. రెండు రోజులపాటు ట్రెడిషనల్ బీట్స్, స్ట్రీట్ ఆర్ట్ ఫెయిర్, ఎలిగంటికా (ఫ్యాషన్ షో), లైవ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్, గెస్సింగ్ గేమ్, సెల్ఫీ కాంటెస్ట్, హుక్ స్టెప్ ఛాలెంజ్, ఫొటో బూత్ డోమ్, డంబ్ చరేడ్స్, అంత్యాక్షరి, ఫేస్ పెయింటింగ్ డబ్‌స్మాష్, విద్యార్థుల ప్రదర్శనలు, డీజే షో యువకులను ఉర్రూతలూగించాయని అన్నారు. చైర్‌పర్సన్ సంస్కృతి-26 అండ్ డీన్ విద్యార్థి వ్యవహారాలు ప్రొఫెసర్ కె.శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు నృత్యం, నాటకం, సంగీతం, గానం రూపంలో తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా యువ మనస్సుల సృజనాత్మకతకు సాక్షులుగా ఉంటారన్నారు. కన్ఫెషన్స్ వంటి 20కి పైగా స్పాట్ ఈవెంట్‌లు జరిగాయని, యువ మనస్సులను తేలికపరచడానికి వినోదం, ఉత్సాహం. అభిరుచితో అనుసంధానం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ సంస్కృతి-26 డాక్టర్ పి.ఎస్.ఎస్.మూర్తి, ఫ్యాకల్టీ ఇన్‌చార్జి ఎండీఎఫ్ క్లబ్ డాక్టర్ టి.శిరీష, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల అధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, ఎండీఎఫ్ క్లబ్ బి.టెక్ చివరి సంవత్సరం విద్యార్థి, ఐటి విభాగం, అధ్యక్షురాలు ఎన్.సంహిత, ఉపాధ్యక్షురాలు పి.శ్రీలాస్య, సంస్కృతి-26 విద్యార్థి ప్రతినిధులు, పిఎంసి క్లబ్ అధ్యక్షుడు జి.సాయి సుమంత్, కె.సాయి ధనుష్ రెడ్డి, సాయిసాత్విక్ (పోస్టర్ డిజైనర్), వైష్ణవి డిస్కో క్లబ్‌పాటు డిస్కో క్లబ్, అధ్యాపక సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు, సాక్ సభ్యులు, విద్యార్ది ప్రతినిధులు, అధ్యాపక సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *