– గుజరాత్‌లో ప్రమాదం
గాంధీనగర్, సెప్టెంబర్ 6: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో శక్తి పీఠమైన పావగఢ్ కొండ ఆలయం వద్ద శనివారం మధ్యాహ్నం గూడ్స్ రోప్‌వే వైర్ తెగి ఆరుగురు మృతిచెందారు. కొండపైకి నిర్మాణ సామగ్రిని తరలించడానికి ఉపయోగించే కార్గో ట్రాలీ కేబుల్స్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్‌మెన్, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు ఉన్నట్టు కలెక్టర్ చెప్పారు. పాపగఢ్ ఆలయం సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉండగా 2000 మెట్లు ఎక్కడం లేదా కేబుల్ కార్ల ద్వారా భక్తులు శిఖరానికి చేరుకోవడం పరిపాటి. అయితే శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా భక్తులు ఉపయోగించే రోప్‌వేను మూసివేసినట్లు ఆలయ అధికారులు వెల్లడిరచారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





