– హాస్పిటల్స్ లో పరిపాలన, చట్టాల అమలుపై చర్చ
– ముగిసిన కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర–2026’
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన రెండు రోజుల ‘ప్రవర–2026’ గవర్నెన్స్ & కంప్లయెన్స్ సమ్మిట్ శుక్రవారం ముగిసింది. బంజారాహిల్స్లో జరిగిన ఈ సదస్సులో హాస్పిటల్స్ పరిపాలన, చట్టపరమైన నిబంధనలు, రోగి భద్రత వంటి అంశాలపై హాస్పిటల్స్ నిర్వాహకులు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు, క్వాలిటీ, కంప్లయెన్స్ విభాగాల ప్రతినిధులు చర్చించారు. సదస్సు రెండో రోజు కార్పొరేట్ కంప్లయెన్స్, మెడికో–లీగల్ కేసులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, హాస్పిటల్స్ భద్రత ప్రమాణాలు వంటి అంశాలపై నిపుణులు ప్రసంగించారు. హాస్పిటల్స్ లో సమగ్ర పరిపాలన వ్యవస్థలు ఉండటం రోగుల భద్రతకు, వైద్య సేవల నాణ్యతకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. కేర్ హాస్పిటల్స్ చీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ రోగుల చికిత్సలో ఇమిగ్రేషన్ నివేదికలు, ఎఫ్ఆర్ఆర్వో నిబంధనలు పాటించడం ఎంతో కీలకమన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు దేశాల సరిహద్దులను దాటి అందుతున్నాయి. దీంతో అంతర్జాతీయ రోగులకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు పాటించే బాధ్యత హాస్పిటల్స్ పై మరింత పెరిగింది. ఇమిగ్రేషన్ రిపోర్టింగ్ నిబంధనలు, ఎఫ్ఆర్ఆర్వో అవసరాలను సమర్థంగా అమలు చేయడం వల్ల అధికారులతో సమన్వయం సులభమవుతుంది, సేవల్లో పారదర్శకత కూడా పెరుగుతుంది. ‘ప్రవర–2026’ వంటి వేదికలు ఆరోగ్యరంగ నాయకులకు రోగికి సేవలు అందించడంలో చట్టపరమైన బాధ్యతలు ఎలా అనుసంధానమై ఉంటాయో అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. దీంతో ఒకేసారి సమర్థవంతమైన సేవలు అందిస్తూ చట్టాల అమలును కూడా పాటించగలవు అని తెలిపారు. ఈ సందర్భంగా స్టాట్యూటరీ కంప్లయెన్స్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు.కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్లో చట్టపరమైన నిబంధనలను సమర్థంగా అమలు చేస్తున్న విభాగాలు, బృందాలను గుర్తించి సత్కరించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ (క్వాలిటీ, ఆపరేషన్స్ & ఈఎస్జీ) రాజీవ్ చౌరే మాట్లాడుతూ, “ప్రవరా–2026 సదస్సు ద్వారా హాస్పిటల్స్ లో పరిపాలన, కంప్లయెన్స్ అంశాలపై అవగాహన పెరిగింది. చట్టాలను పాటించడం కేవలం విధి మాత్రమే కాదు, రోగి భద్రతకు, నైతిక వైద్య సేవలకు అది ముఖ్యమైన ఆధారం అన్నారు. ఈ సదస్సులో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం, మానవ అవయవ మార్పిడి చట్టం, పీసీపీఎన్డీటీ చట్టం, పర్యావరణ నిబంధనలు, కార్మిక చట్టాలు, హాస్పిటల్స్ భద్రత ప్రమాణాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సు ద్వారా హాస్పిటల్స్ ల్లో పారదర్శక పరిపాలన, చట్టాల అమలు, బాధ్యతాయుత వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలనే కేర్ హాస్పిటల్స్ సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





