అవ‌య‌వాన్ని కోల్పోతే స్వ‌తంత్ర జీవ‌నం కోల్పోయిన‌ట్టే

– జీవితాన్ని ప‌రిపూర్ణంగా మార్చ‌డ‌మే నిజ‌మైన వైద్యం
– ఆంప్యుటేష‌న్ మొద‌టి నిర్ణ‌యం కాకూడ‌దు
– ఇలిజారోవ్ లింబ్ రీకన్‌స్ట్రక్ష‌న్‌ విధానంతో ఎంతో మేలు
– కేర్ హాస్పిట‌ల్స్ విజ‌య‌గాథ‌లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10: ఒక చేయి లేదా కాలు కోల్పోవడం అంటే ఉద్యోగం, స్వతంత్ర జీవితం, సామాజిక గౌరవం కోల్పోవడమే. అందుకే నిజమైన వైద్యం అనేది కేవలం ప్రాణాలు కాపాడటమే కాదు జీవితాన్ని మళ్లీ సంపూర్ణంగా మార్చడం కూడా. ఈ భావనతోనే కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్‌లో నలుగురు రోగుల చేతులు–కాళ్లను కాపాడిన అరుదైన లింబ్ సాల్వేజ్ విజయగాధ‌ల‌ను జాతీయ రహదారి భద్రతా దినోత్సవం (11 జనవరి) పురస్కరించుకొని వెలుగులోకి తీసుకొచ్చారు. తీవ్రమైన గాయాల్లో కూడా చివరి పరిష్కారంగా మాత్రమే కాలు లేదా చేయి తొలగించాలి. అది మొదటి నిర్ణయం కాకూడదని ఈ కేసులు చాటి చెబుతున్నాయి. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ వైద్యుడు డా. అజయ్ కుమార్ పరుచూరి నాయకత్వంలో, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న నాలుగు చేతులు–కాళ్లను ఇలిజారోవ్ లింబ్ రీకన్‌స్ట్రక్ష‌న్‌ విధానంతో విజయవంతంగా కాపాడారు. రోడ్డు ప్రమాదాలు, పరిశ్రమల ప్రమాదాలు, రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన ఈ రోగులు… దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్లు, ఎముకల నష్టం, విఫలమైన గత శస్త్రచికిత్సల కారణంగా చాలా చోట్ల “అంప్యూటేషన్ తప్పదు” అనే సమాధానమే వినేవారు. హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల ఎన్.నీలిమాదేవి రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన ఓపెన్ ఫ్రాక్చర్‌కు గురయ్యారు. గత చికిత్సల తర్వాత ఎముకలో ఇన్‌ఫెక్షన్ రావడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఇన్‌ఫెక్షన్ ఉన్న ఇంప్లాంట్లను తొలగించి ఇలిజారోవ్ ఫిక్సేటర్ అమర్చారు. దీర్ఘకాల చికిత్స, బోన్ గ్రాఫ్టింగ్‌తో ఎముక పూర్తిగా కలిసిపోయి… నీలిమా మళ్లీ స్వయంగా నడవగలిగే స్థితికి చేరుకున్నారు. ఇంకొక కేసులో హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల డి. వెంకటేశ్వర రెడ్డి కదులుతున్న రైలు నుంచి పడిపోవడంతో తీవ్రంగా మట్టి, మలినాలతో నిండిన ఓపెన్ ఫ్రాక్చర్ ఏర్పడింది. అత్యవసరంగా ఇలిజారోవ్ ఫిక్సేషన్ చేయడం ద్వారా క్రమంగా ఎముక మానిపించి… శాశ్వత వికలాంగతను తప్పించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు పరిశ్రమ ప్రమాదంలో కాలిన గాయాలు, అనేక ఎముకల విరుగుడులతో తీవ్రంగా గాయపడ్డాడు. ఏళ్ల తరబడి మానని గాయాలు, ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతూ… ఇతర ఆసుపత్రుల్లో అంప్యూటేషన్ సలహా కూడా పొందాడు. కేర్ హాస్పిటల్స్‌లో దశలవారీగా ఇలిజారోవ్ విధానంతో చికిత్స చేసి, ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించి, ఎముకలు కలిపి, 6 సెంటీమీటర్ల లింబ్ లెంగ్త్ పెంపు కూడా విజయవంతంగా చేశారు. ఫలితంగా అతడు మళ్లీ సరిగా నడవగలిగే స్థితికి చేరుకున్నాడు. నాలుగో కేసులో ఖమ్మం జిల్లా చెందిన 51 ఏళ్ల సిహెచ్. లక్ష్మణ్ బైక్ ప్రమాదంలో తీవ్రమైన ఓపెన్ ఫ్రాక్చర్‌తో పాటు రక్తనాళాలకు గాయాలపాలయ్యాడు. ఇలిజారోవ్ ఫిక్సేషన్, బోన్ గ్రాఫ్టింగ్, క్రమబద్ధమైన రిహాబిలిటేషన్‌తో చికిత్స చేసి… మళ్లీ స్వతంత్రంగా నడిచేలా చేశారు.

ఈ విజయాలపై డా. అజయ్ కుమార్ పరుచూరి మాట్లాడుతూ కాలు లేదా చేయిని కాపాడటం అంటే కేవలం అంప్యూటేషన్ తప్పించడమే కాదు.. ఆ వ్యక్తి జీవనోపాధి, స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడటమే. ఇలిజారోవ్ చికిత్సకు వైద్యుల సహనం, నైపుణ్యం అవసరం. రోగితో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉండాలి. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా లింబ్ సాల్వేజ్‌పై నమ్మకం ఉంటే జీవితాలు మారుతాయని ఈ కేసులు నిరూపించాయి అన్నారు. కేర్ హాస్పిటల్స్ బాధ్యతపై బిజూ నాయర్ , జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కేర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ సమాజంలో ఒక అవయవం కోల్పోతే కుటుంబం ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతుంది. వికలాంగత జీవితాన్ని నిర్ణయించే దశకు చేరకముందే జోక్యం చేసుకోవడమే ఆసుపత్రిగా మా బాధ్యత. ఈ లింబ్ సాల్వేజ్ విజయాలు మానవత్వానికి ముందుగా నిలిచే వైద్యానికి మా నిబద్ధతను చూపిస్తున్నాయి” అన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, బలమైన బహుళ వైద్య విభాగాల సమన్వయం, క్లిష్టమైన ట్రామా, రీకన్‌స్ట్ర‌క్ష‌న్‌లో ఉన్న అనుభవంతో కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ లింబ్ సాల్వేజ్ శస్త్రచికిత్సలకు విశ్వసనీయ రిఫరల్ కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. అంప్యూటేషన్‌కు మించిన భవిష్యత్తు ఉందని రోగులకు నమ్మకం కల్పిస్తూ జీవితానికి మళ్లీ అవకాశాలు ఇవ్వడమే నిజమైన వైద్యం అనే సందేశాన్ని మరోసారి చాటుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *