కేర్‌ హాస్పిటల్స్‌లో అరుదైన హార్ట్‌ సర్జరీ

– విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: మలక్‌పేటలోని కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు నల్గొండకు చెందిన 30 కిలోల బరువు మాత్రమే ఉన్న 29 ఏళ్ల మహిళకు మిట్రల్‌ వాల్వ్‌ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇది చాలా క్లిష్టమైన హార్ట్‌ సర్జరీగా పరిగణిస్తారు. శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జరగగా హై-రిస్క్‌ హార్ట్‌ కేర్‌లో మరో కీలక విజయాన్ని సూచిస్తోంది. శ్వాస ఆడకపోవడం, దడ వంటి సమస్యలతో రజిత (పేరు మార్చబడిరది)ను మలక్‌పేటలోని కేర్‌ హాస్పిటల్‌లో చేరింది. వైద్య పరీక్షలలో ఆమె తీవ్రమైన మిట్రల్‌ వాల్వ్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఈ పరిస్థితి ఎడమ గుండె గదుల మధ్య వాల్వ్‌ సరిగ్గా మూసుకుపోనందున ఏర్ప్ణడుతుంది. కాగా, ఆమెకు హైపోథైరాయిడిజం కూడా ఉంది. మలక్‌పేటలోని కేర్‌ హాస్పిటల్స్‌ కార్డియోథొరాసిక్‌, వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ గండ్రకోట మాట్లాడుతూ యువతలో మిట్రల్‌ వాల్వ్‌ సమస్యలు తరచూ బాల్యంలో వచ్చిన రుమాటిక్‌ జ్వరంతో సంబంధం ఉండవచ్చు.. అప్పట్లో అది గుర్తించకపోతే కాలక్రమంలో గుండె కవాటాలకు నష్టం కలిగించవచ్చు.. ఈ రోగి విషయంలో కూడా అలాంటి రుమాటిక్‌ సమస్యే కారణమై ఉండొచ్చని తాము అనుమానిస్తున్నాం.. ఇది చివరకు తక్షణం శస్త్రచికిత్స అవసరమైన స్థితికి తీసుకువచ్చింద’ని చెప్పారు. ఆమెను పరీక్షించే సమయంలో వైద్య బృందం ఆమెకు తెలియని పాక్షిక మూర్ఛల సమస్యను కూడా గుర్తించిందని, దీని వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని వివరించారు. ఈ కారణాల వల్ల శస్త్రచికిత్సలో ఆమెకు 15శాతం కంటే ఎక్కువ ప్రమాదం ఉందని లెక్కించామని, ఇది సాధారణ ఆరోగ్యస్థితి కలిగిన వారిలో ఉండే 2శాతం కంటే చాలా ఎక్కువని ఆయన చెప్పారు. కానీ తమ బహుళ విభాగాల బృందం సమన్వయంతో, స్పష్టమైన శస్త్రచికిత్సా ప్రణాళికతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇది తమ బృందానికి గర్వంగా అనిపించే విషయమని, క్లిష్టమైన హార్ట్‌ సర్జరీలను నిర్వహించగల నైపుణ్యం కేర్‌ హాస్పిటల్స్‌కి ఉందని ఈ విజయం రుజువు చేసిందని డాక్టర్‌ సుధీర్‌ తెలిపారు. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ ఈ విజయవంతమైన శస్త్రచికిత్స తమ హాస్పిటల్‌లో ఉన్నతమైన వైద్య సేవలు, డాక్టర్ల సమష్టి కృషికి మంచి ఉదాహరణ అని అన్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలతోపాటు అధిక ప్రమాదం ఉన్న రోగికి చికిత్స చేయడం చాలా సవాలుతో కూడిన విషయమైనప్పటికీ తమ వైద్య బృందం అంకితభావంతో పనిచేసి ప్రపంచస్థాయి వైద్యసేవలను అందించిందని ఆయన కొనియాడారు. అలాంటి ప్రతి విజయగాథ సంక్లిష్ట కార్డియాక్‌ కేర్‌లో సాధ్యమయ్యే సరిహద్దులను అధిగమించడంలో తమ నమ్మకాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ కేసు ద్వారా కేర్‌ హాస్పిటల్స్‌ అధిక ప్రమాదంతో కూడిన హార్ట్‌ ట్రీట్మెంట్‌ పట్ల తీసుకునే బాధ్యతను చూపిస్తోందని, అలాగే కష్టం ఉన్న అరుదైన కేసులను జాగ్రత్తగా, కరుణతో విజయవంతంగా నిర్వహించే వైద్య బృందం నైపుణ్యాన్ని కూడా హైలైట్‌ చేస్తుందని డాక్టర్‌ ప్రవీణ్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *