కేర్‌ హాస్పిటల్‌లో అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ రిథమ్‌ క్లినిక్‌

– ఈ తరహా మొట్టమొదటి కేంద్రం ఇది
-గుండె జబ్బు రోగులకు ప్రయోజనకరం
– గుండె సంరక్షణలో కొత్త ప్రమాణాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : హృదయ సంబంధిత అరిత్మియాలు, అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమస్యల గుర్తింపు, చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌లో ‘అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ రిథమ్‌ క్లినిక్‌’ను శుక్రవారం ప్రారంభించారు. కార్డియాక్‌ ఎలక్ట్రోఫిజియాలజీ క్లినికల్‌ డైరెక్టర్‌, ప్రఖ్యాత ఎలక్ట్రోఫిజియాలజిస్ట్‌ డాక్టర్‌ రామకృష్ణ ఎస్వీకే ఈ క్లినిక్‌కు నాయకత్వం వహించనున్నారు. ప్రముఖ వైద్యుల సమక్షంలో కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ నిఖిల్‌ మాథుర్‌, ఈ క్లినిక్‌ను ప్రారంభించారు.ఈ ప్రత్యేక క్లినిక్‌ హైదరాబాద్‌లో గుండె సంరక్షణలో ఒక పెద్ద పురోగతి. ఇది ఏట్రియల్‌ ఫైబ్రిలేషన్‌, బ్రాడీకార్డియా, టాచీకార్డియా వంటి లయ సమస్యలతో బాధపడుతున్నవారికి, అలాగే ఆకస్మిక గుండె మరణం ప్రమాదం ఉన్న రోగులకు ప్రయోజనం చేకూర్చడానికి రూపొందించబడిరది. ముఖ్యంగా గుండెపోటు, గుండె వైఫల్యం, వాల్వ్‌ లోపాలు, జన్యుపరమైన అరిథ్మియా సిండ్రోమ్‌ల చరిత్ర ఉన్న రోగులకోసమే ఈ క్లినిక్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.ఈ క్లినిక్‌లో అనేక విభాగాలు, ప్రోటోకాల్‌ ఆధారిత చికిత్సా విధానాలతో సేవలు అందిస్తున్నారు. ఇందులో ఈసిజి , హోల్టర్‌ మానిటరింగ్‌, టిఎంటి, ఎలక్ట్రోఫిజియాలజిస్‌ స్టడీస్‌, 3డి ఎలక్ట్రోఅనాటమికల్‌ మ్యాపింగ్‌ వంటి పరీక్షలు ఉన్నాయి. అలాగే పేస్‌మేకర్‌, ఇంప్లాంటబుల్‌ కార్డియోవర్టర్‌ డీఫిబ్రిలేటర్‌, కార్డియాక్‌ రీసింక్రొనైజేషన్‌ థెరపీ, కండక్షన్‌ సిస్టమ్‌ పేసింగ్‌ వంటి డివైస్‌ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్వెన్షనల్‌ చికిత్సలలో రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌, క్రయో అబ్లేషన్‌ చేయడం జరుగుతుంది. అంతేకాదు, రోగుల దీర్ఘకాలిక సంరక్షణకూ ప్రత్యేక దృష్టి కల్పిస్తున్నారు. ఇందులో రిస్క్‌ ఫ్యాక్టర్‌ మోడిఫికేషన్‌, యాంటీకోగ్యులేషన్‌ మేనేజ్‌మెంట్‌, అలాగే ఇంప్లాంట్‌ చేసిన పరికరాల ఫాలోఅప్‌ వంటి సేవలు వున్నాయి. ‘‘అరిథ్మియా, గుండె వైఫల్యం వంటి సమస్యలు చాలాసార్లు సమయానికి గుర్తించకపోవడం లేదా సరైన విధంగా చికిత్స చేయకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ క్లినిక్‌లో రోగులకు నిర్మాణాత్మకంగా మూల్యాంకనం చేయడంతో పాటు, ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలు అందిస్తున్నాం. ముందుగానే వ్యాధిని గుర్తించి చికిత్స మొదలుపెడితే, రోగుల ఆరోగ్య ఫలితాలు, జీవన నాణ్యతను మెరుగుపర్చడం పూర్తిగా సాధ్యమవుతుంది’’ అని బంజారాహిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌ కార్డియాక్‌ ఎలక్ట్రోఫిజియాలజీ క్లినికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రామకృష్ణ ఎస్వికె తెలిపారు. ఈ కార్యక్రమంలో కేర్‌ హాస్పిటల్స్‌ జోనల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బిజు నాయర్‌ మాట్లాడుతూ, ‘‘దేశంలోని అత్యంత విశ్వసనీయమైన, ఆధునిక కార్డియాక్‌ ప్రోగ్రామ్‌లలో బంజారాహిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌ ఒకటిగా గుర్తింపు పొందింది. గుండె సంరక్షణలో కొత్త ప్రమాణాలను స్థాపించడం మా లక్ష్యం. ఇప్పుడు ప్రారంభించిన అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ రిథమ్‌ క్లినిక్‌తో, ప్రపంచ స్థాయి అరిథ్మియా మరియు గుండె వైఫల్య చికిత్సను రోగులకు మరింత చేరువ చేస్తాం. ఈ క్లినిక్‌లో వారికి అత్యుత్తమ వైద్య సేవలతో పాటు, ఒకే చోట సౌలభ్యం, నాణ్యత, నమ్మకం అన్నీ అందుబాటులో ఉంటాయి,’’ అన్నారు. భారతదేశంలో చాలా ఆసుపత్రులు ఎలక్ట్రోఫిజియాలజీ సేవలు అందిస్తున్నా, బంజారాహిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌ ప్రారంభించిన అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ రిథమ్‌ క్లినిక్‌ మాత్రం హైదరాబాద్‌ నగరంలో రిథమ్‌ డిజార్డర్లు మరియు గుండె ఆగిపోవడమంతటి తీవ్రమైన పరిస్థితులకు రోగ నిర్ధారణ, చికిత్స, పర్యవేక్షణ, దీర్ఘకాలిక సంరక్షణను కలిపి అందిస్తున్న తొలి క్లినిక్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ క్లినిక్‌తో బంజారాహిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌ అరిథ్మియా నిర్వహణలో కీలక భూమిక పోషిస్తోంది. కార్డియాక్‌ చికిత్సలో నూతన ప్రమాణాలను నెలకొల్పుతూ, ఈ ప్రాంతంలో ముందున్న ఆసుపత్రిగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *