– ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యం
– ఉద్యోగులే సంస్థల అభివృద్ధికి కీలకం
– నిపుణుల అభిప్రాయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21:కేర్ హాస్పిటల్స్ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖ సంస్థల హెచ్‌ఆర్ లీడర్స్, సీఏక్స్ఓలు, కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల ఆరోగ్యం, ముందస్తు వైద్య సంరక్షణ, సంస్థల శ్రేయస్సు అంశాలతోపాటు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి మారుతున్న సవాళ్లపై చర్చించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థలు ఎక్కువ ఉత్పాదకత, స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధిని సాధించగలవని నిపుణులు పేర్కొన్నారు. కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ సంస్థలు అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స చేయడంపైకాక ముందస్తు ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలన్నారు. క్రమబద్ధమైన హెల్త్ చెక్‌అప్స్, నివారణ చర్యలు, ఉద్యోగుల శ్రేయస్సు కార్యక్రమాలు సంస్థలకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తాయి. ఉద్యోగుల ఆరోగ్యం ఒక ఖర్చు కాదు.. అది వ్యూహాత్మక పెట్టుబడి అని అన్నారు. శలభ్ డాంగ్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆరోగ్య సేవలు అంటే సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెక్‌అప్ మాత్రమే కాదు.. ముందస్తు నిర్ధారణ, అత్యవసర సేవలు, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ అన్నీ కలిసిన సమగ్ర విధానం అవసరం. సంస్థల అవసరాలకనుగుణంగా ఆరోగ్య కార్యక్రమాలు రూపొందించడమే లక్ష్యం అని తెలిపారు. డాక్టర్ అమిత్ సింగ్ మాట్లాడుతూ ఉద్యోగుల శ్రేయస్సు మాటల్లో కాక కార్యాచరణలో కనిపించాలి. ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యాలయ సంస్కృతి అవసరం అన్నారు.
అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ (ఐక్రిసాట్) హెచ్‌ఆర్ విభాగాధిపతి దీప్తి రైనా, వయాట్రిస్ (మైలాన్ ల్యాబ్స్) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ అడబ్లా, అడాప్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రావంతి చెక్రగారి, జెన్‌జియోన్ ఎస్‌వీపీ & గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్ జనని ప్రకాష్, మై హోమ్ గ్రూప్ ఏవీపీహెచ్‌ఆర్ సుదీప్ కుమార్ కె, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హెడ్–ఉద్యోగుల ఆరోగ్యం & భద్రత షాలిని రెడ్డి సింగిరెడ్డి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ కొడిగంటి, గ్లోబల్ డేటా పీఎల్సీ సిహెచ్‌ఆర్‌ఓ ప్రవీణ్ చందా, వికాట్(భారతి సిమెంట్స్) హెచ్‌ఆర్ హెడ్ మాలిని చటర్జీ, సీ-టెల్ ఇన్ఫోసిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్,హెచ్‌ఆర్ ప్రమోద్ కుమార్ బేబర్తా తదితరులు ఆరోగ్యకరమైన కార్యాలయ వాతావరణం నిర్మాణంపై అభిప్రాయాలను పంచుకున్నారు. కేర్ హాస్పిటల్స్ రూపొందించిన సమగ్ర కార్పొరేట్ ఆరోగ్య కార్యక్రమం ‘హెల్త్ గార్డియన్స్’ను ఆవిష్కరించారు. ‘కేర్ కనెక్ట్ -హెచ్ఆర్ 2026’ ద్వారా కార్పొరేట్ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని కేర్ హాస్పిటల్స్ ప్రతిజ్ఞ చేసింది. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథూర్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ సింగ్, హెడ్–క్రెడిట్ బిజినెస్ సిద్ధార్థ్ దత్త తదితరులు, 200మందికి పైగా హెచ్‌ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



