– ముగ్గురు మహిళలు, ఓ బాలిక దుర్మరణం
– మృతులను కాగజ్‌నగర్ వాసులుగా గుర్తింపు
కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: క్రిస్మస్ పండగపూట దేశంలో పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17మంది మృతిచెందిన ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే మహారాష్ట్రలో మరో ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా దేవాడ దగ్గర ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జాకీర్ కుటుంబ సభ్యులు, తమ బంధువులతో కలిసి వైద్యం కోసం మహారాష్ట్ర నాగపూర్‌లోని ఓ హాస్పిటల్‌కి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ దేవదా తహసీల్‌లోని సోండో గ్రామ శివార్లలో వంతెనపై నుంచి కారు వాగులోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్న వారిలో ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతిచెందారు. మృతులను సల్మా బేగం, శబ్రీమ్, ఆప్జా బేగం, సహారగా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించడంతో కాగజ్‌నగర్‌లో విషాదం అలుముకుంది.
బోల్తాపడ్డ స్కూల్ బస్సు : విద్యార్థులకు స్పల్ప గాయాలు
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడిరది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా మరికల్‌లోని మణికంఠ జూనియర్ కాలేజీకి చెందిన బస్సు విహారయాత్రకు వెళుతుండగా బోల్తా పడిరది. వీరంతా హైదరాబాద్‌లోని జలవిహార్‌కు వెళ్తున్నారు. హైదరాబాద్`బెంగళూరు హైవేపై బాలానగర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తాపడిరది. విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





