ఆగివున్న లారీని ఢీకొన్న కారు

– అక్కడికక్కడే ఇద్దరి మృతి

కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ -పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్‌ ఫ్లై ఓవ‌ర్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో కారు ఒకవైపు భాగం నుజ్జునుజ్జ అయ్యింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతులను సయ్యద్ అబ్దుల్ రెహమాన్ (19), సయ్యద్ అతియాబ్ హుస్సేన్ (21)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఎండీ అదునాన్ అని తెలిపారు. ఇక ఎండీ అబ్రార్ అనే వ్యక్తి కారులో నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *