– కారు ఢీకొని యువకుడి దుర్మరణం
ఖమ్మం, ఏప్రిల1 : తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఆ యువకుడిని మృత్యువులా దూసుకొచ్చిన కారు కబళించింది. ఈ సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన గొడ్డుగొర్ల ప్రసాద్(28) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతనికి వివాహం నిశ్చయమైంది. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మద్దులపల్లి స్టేజ్ వద్ద ఉన్న కిరాణ షాపునకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చేందుకు రోడ్డు దాటుతున్నాడు. ఆ క్రమంలో వేగంగా వచ్చిన ఓ కారు ప్రసాద్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. రేపు నిశ్చితార్థం జరగాల్సిన తమ బిడ్డ ఇలా విగత జీవిగా మారడంపట్ల తల్లిదండ్రుల రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు.
`తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


