– కారు పల్టీలు కొట్టడంతో ఇద్దరు టీచర్ల మృతి
– మరో ముగ్గురు టీచర్లకు తీవ్ర గాయాలు
సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 17: అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు కారులో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంక్రాంతి సెలవుల అనంతరం శనివారం స్కూళ్లు తెరుచుకోవడంతో రోజువారీ విధుల్లో భాగంగా నల్గొండ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ప్రభుత్వ పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులు కారులో బయలుదేరారు. అర్వపల్లి వద్ద కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఐదుగురిలో కస్తూర్బా గాంధీ ఏఎస్‌వో కల్పన అక్కడికక్కడే మృతిచెందారు. హెడ్‌మాస్టర్ గీత హైదరాబాద్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు వదిలారు. మిగిలిన ముగ్గురు ప్రస్తుతం సూర్యాపేట జిల్లా జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



