మోకిల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– చెట్టును ఢీకొన్న విద్యార్థుల కారు
– నలుగురు ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ విద్యార్థుల దుర్మరణం

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 8: రంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడటంతో నలుగురు విద్యార్థులు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ విద్యార్థులు శ్రీనిఖిల్‌, ‌సూర్యతేజ, సుమిత్‌, ‌రోహిత్‌, ‌నక్షత్ర అనే యువతి కలిసి కోకాపేటలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఓ స్నేహితుడిని వ‌దిలిపెట్టి తిరిగి మోకిల నుండి హైదరాబాద్‌ ‌నగరానికి వస్తుండగా తెల్లవారుజామున మోకిల పరిధిలోని మీర్జాగూడ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. నక్షత్రకి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే యువతిని అత్యవసర చికిత్స ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *