– జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల మొబైల్ వాహన సేవలను మెదక్ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సౌకర్యార్థం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ఆయన లోక్‌భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనంలోని సౌకర్యాలను ఎంపీ రఘునందన్ రావు గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. హాస్పిటల్‌లో ఉండే స్క్రీనింగ్ సౌకర్యాలు ఇందులో ఉన్నాయన్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే.. తగిన చికిత్స ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.