శ్వాస మార్గాన్ని మూసిన క్యాన్సర్

– అరుదైన శస్త్రచికిత్సతో యువకుడికి కొత్త జీవితం
– ప్ర‌సాదించిన‌ కేర్ వైద్యులు

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వైద్యులు అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా మహారాష్ట్రలోని యవత్మాల్‌కు చెందిన 30 ఏళ్ల మనోజ్ భానుదాస్‌కు కొత్త జీవితం ప్ర‌సాదించారు. ఆయనకు ఉన్న థైరాయిడ్ క్యాన్సర్ శ్వాసనాళం (ట్రాకియా) వరకు వ్యాపించి, తీవ్రమైన శ్వాస సమస్యను కలిగించింది. ఈ పరిస్థితి ప్రాణాపాయం దాకా వెళ్లే అవకాశం ఉండడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోగి సురక్షితంగా కోలుకుంటూ సాధారణంగా శ్వాస తీసుకుంటున్నారు. నెల రోజులుగా మనోజ్‌కు ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ వచ్చింది. చివరికి సాధారణ పనులు చేయడమే కష్టంగా మారింది. పరీక్షల్లో థైరాయిడ్‌లో ఏర్పడిన ట్యూమర్ శ్వాసనాళాన్ని పాక్షికంగా మూసివేసిందని గుర్తించారు. కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ పవార్ నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ సర్జరీ బృందం ఈ క్లిష్ట శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఇందులో థైరాయిడ్ గ్రంథిని పూర్తిగా తొలగించడం (టోటల్ థైరాయిడెక్టమీ), ప్రభావితమైన శ్వాసనాళ భాగాన్ని కత్తిరించి మళ్లీ కలపడం (ట్రాకియల్ రీకన్‌స్ట్రక్షన్) చేశారు. శస్త్రచికిత్సలో సుమారు 7 x 6 సెం.మీ. పరిమాణం ఉన్న ట్యూమర్‌ను తొలగించారు. శ్వాసనాళాన్ని పునర్నిర్మిస్తూ గొంతు ధ్వని, శరీర సమతుల్యతకు అవసరమైన ముఖ్యమైన భాగాలు, గ్రంథులను జాగ్రత్తగా కాపాడారు. శస్త్రచికిత్స ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తైంది. అనంతరం రోగిని ఐసీయూలో పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతూ డిశ్చార్జ‌యి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ పవార్ మాట్లాడుతూ థైరాయిడ్ క్యాన్సర్ శ్వాసనాళానికి చేరితే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ట్యూమర్ తొలగించడం మాత్రమే కాదు, శ్వాసనాళాన్ని సురక్షితంగా మళ్లీ నిర్మించడం పెద్ద సవాలు. సరైన సమయంలో చికిత్స చేస్తే ఇలాంటి క్లిష్ట కేసుల్లో కూడా మంచి ఫలితాలు సాధ్యమే అని తెలిపారు. ఇవి సాధారణ శస్త్రచికిత్సలు కావు. వైద్యుల సమన్వయం, ఖచ్చితమైన ప్రణాళిక, ఉన్నతస్థాయి నైపుణ్యం అవసరం అని అన్నారు. కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిలేష్ గుప్తా మాట్లాడుతూ ఇలాంటి క్లిష్ట, అత్యవసర పరిస్థితులను తమ వైద్య బృందం సమర్థంగా నిర్వహించగలగడం తమ సామర్థ్యాన్ని చూపిస్తుంది.. రోగులకు అత్యాధునిక చికిత్స అందించేందుకు తాము నిరంతరం పెట్టుబడులు పెడుతున్నాం అని చెప్పారు.
రోగి మనోజ్ మాట్లాడుతూ ఒక దశలో నాకు ఊపిరి కూడా సరిగా పీల్చుకోలేనట్లైంది. చాలా భయంగా అనిపించింది. వైద్యులు అన్నీ వివరంగా చెప్పి ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు సులభంగా శ్వాస తీసుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. దేశంలో థైరాయిడ్ క్యాన్సర్ కేసులు ముఖ్యంగా యువతలో పెరుగుతున్నాయి. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం. ఆలస్యమైతే శ్వాసనాళం వంటి కీలక అవయవాలకు వ్యాపించి ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి క్లిష్ట కేసులకు నైపుణ్యం కలిగిన వైద్యులు, ఆధునిక సదుపాయాలు, సమన్వయంతో కూడిన చికిత్స అవసరం. కేర్ హాస్పిటల్స్ ఈ రంగంలో తన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సమయానికి నిర్ధారణ, ఆధునిక శస్త్రచికిత్స, బృంద వైద్య సేవలతో ప్రాణాలను కాపాడవచ్చని ఈ కేసు మరోసారి నిరూపించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *