రాహుల్‌ ‌గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి

– లోక్‌సభలో బీజేపీ ఎంపి నిషికాంత్‌ ‌దూబె తీర్మానం

న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపి నిషికాంత్‌ ‌దూబె గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన వ్యాఖ్యలతో ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ ‌తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్‌ ‌పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ’నేను రాహుల్‌ ‌సోరస్‌ ‌సంస్థతో చేతులు కలిపి దేశాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో వివరిస్తూ ఈరోజు లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాను.. నేను ప్రతిపాదించిన తీర్మానంలో రాహుల్‌ ‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనను జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని అభ్యర్థించాను’ అని అన్నారు. కాగా, నిన్న రాహుల్‌గాంధీ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయిందని, భరతమాతను అమ్మేశారని వ్యాఖ్యానించారు. మరుసటి రోజే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపి తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్‌ ‌గాంధీ పార్లమెంట్‌ ‌సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఏంపీ నిషికాంత్‌ ‌దూబే గురువారం లోక్‌సభలో ’సబ్‌స్టాంటివ్‌ ‌మోషన్‌’ ‌దాఖలు చేశారు. రాహుల్‌ ‌గాంధీ పార్లమెంట్‌ ‌సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ ఎంపీ ప్రవేశపెట్టిన ఆ తీర్మానంపై కేంద్రం విముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే రాహుల్‌గాంధీ బుధవారం చేసిన ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ’జార్జ్ ‌సోరోస్‌ ‌వంటి శక్తుల సహాయంతో రాహుల్‌ ‌గాంధీ దేశాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో వివరిస్తూ నేను ఈరోజు లోక్‌సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. ఈ విషయాన్ని చర్చించాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్‌ ‌చేస్తున్నా’ అంటూ దూబే అన్నారు.  అమెరికా-భారత్‌ ‌ట్రేడ్‌ ‌డీల్‌ ‌గురించి రాహుల్‌ ‌గాంధీ బుధవారం లోక్‌సభలో తీవ్ర ఆరోపణలు చేశార. ఈ ఒప్పందం ద్వారా భారత ప్రయోజనాలను పూర్తిగా అమెరికాకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ ట్రేడ్‌ ‌డీల్‌ను రాహుల్‌ ‌గాంధీ ’పూర్తి లొంగుబాటు’గా అభివర్ణించారు. భారతదేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారని, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారని ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *