ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్, సెప్టెంబర్ 30: కెనడా దేశంలోని కిచనీర్ ప్రాంతంలోని వాటర్‌లూ రిమ్‌పార్క్‌లోగల ఫర్‌లేస్ హాల్‌లో తెలుగువారంతా కలిసి సద్దుల బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు మహిళలు సుమారు 800 మంది సాంప్రదాయ దుస్తుల్లో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. భారతీయ మహిళలతోపాటు స్థానిక కెనడియన్స్‌కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందించారు. సోక్టా నిర్వాహకులు మానవ్ నాగపిడుగు, మండువ గోపీకృష్ణ, ఎల్. సుదర్శన్, నవీన్‌రెడ్డి తదితరులు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.
లండన్ లో ..
లండన్ బెర్క్‌షైర్‌లోని రెడింగ్‌లో శ్రీనిలయం సేవాసమితి అద్వర్యంలో పెద్ద ఎత్తున బతుక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు . సుమారు 500 మంది మహిళలు సాంప్రదాయ కట్టుబొట్టుతో, బతుకమ్మలను నెత్తిమీద పెట్టుకుని పాటలు, ఆటలతో అలరించారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన వారంతా కలిసి ఇందూ, సిరి, వెన్నల, బిందు నేతృత్వంలో ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





