– ఉప ఎన్నికలో పది వేల లోపే వోట్లు రాలుతాయి
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల వోట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 25 వేలకు ఒక్క వోటు తగ్గకుండా తీసుకువస్తే.. రేం చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల వోట్లు బీజేపీ అభ్యర్థికి రాకపోతే.. తాను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పదివేల లోపే బీజేపీకి వోట్లు వొస్తాయని పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడలో ప్రచారంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ‘మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండి కూడా అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు మావైపు ఉన్నారు. మేము అధికారంలోకి వొచ్చి అందించిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున సానుకూలంగా ఉన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అభివృద్ధి చేయించు కుంటున్నారో.. ఇక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధి చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ పెన్షన్లు ఇచ్చిన నిధులను కూడా లెక్క చెబితే.. అది అభివృద్ధి అవుతుందా?. అభివృద్ధి చేయడం అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ చేయడం. ఈ రెండు నెలల్లోనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా 2500 కోట్ల అభివృద్ధి పనులను చేశామని అన్నారు. ‘దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఇక మా పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత కూడా ఇక్కడ సమస్యలను రిప్రెంటేషన్ చేయడంలో విఫలమయ్యాడు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్ సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కిషన్ రెడ్డికి సహకరించింది. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గురుదక్షిణగా బీజేపీ అభ్యర్థిని బీఆర్‌ఎస్కు తాకట్టు పెట్టాడు. ప్రచారం సరళి చూసిన ప్రజలు సొంత ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్‌ఎస్ పార్టీకి లొంగిపోయారని అంటున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలో ఓటు ఎటు వేసిన సరే అనే ప్రవర్తన కనిపిస్తుందని ప్రజలే అంటున్నారు. రు కేంద్ర మంత్రిగా ఉన్నారు.. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా పార్లమెంట్ పరిధిలోకే వస్తది. మరి నా చాలెంజ్ కు కిషన్ రెడ్డి సిద్ధమా?. ప్రజల స్పందన చూస్తే కచ్చితంగా మెజారిటీతోనే జూబ్లీహిల్స్ గెలవబోతున్నాం’ అని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





